ప్రాణాలు పణంగా పెట్టాడు.. గిన్నిస్ బుక్ రికార్డ్ కోసం ఏం చేశాడంటే?

praveen
ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ది గిన్నిస్ బుక్ రికార్డ్. ఈ క్రమంలోనే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు సంపాదించుకోవడానికి ఎంతోమంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ కొంతమందికి మాత్రమే గిన్నిస్ బుక్ లో రికార్డు దక్కుతూ ఉంటుంది. ఇలా గిన్నిస్ బుక్ లో ప్రపంచ రికార్డు సాధించాలి అంటే ఇక ప్రపంచంలో ఉన్న అందరిలోకి మనకంటూ ఒక ప్రత్యేకమైన టాలెంట్ ఉండాలి. ఇక ఇలాంటి టాలెంటు ఉన్నప్పుడు మాత్రమే అటు గిన్నిస్ బుక్లో చోటు దక్కుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుచుకోవడానికి ఎంతో మంది సర్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.


 కొంతమంది ఏకంగా ఇక గిన్నిస్ బుక్ లో చోటు దక్కించుచుకోవడానికి ఎంతటి సాహసం చేయడానికైనా వెనుకాడరు అనే చెప్పాలి. ప్రాణాలను సైతం ఫణంగా పెడుతూ ఉంటారు. ఇక ఇలా అనుకున్నది సాధించి రికార్డులు సృష్టించడానికి ఏళ్ల తరబడి కఠోర సాధన చేస్తూ ఉంటారు. ఇక ఇటీవల ఒక వ్యక్తి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్నాడు. ఇందులో కొత్తేముంది అనుకుంటున్నారు కదా అతను ఒళ్ళు గగుర్లు పొడిచే సాహసం చేసి గిన్నిస్ బుక్ లో చోటు దక్కించుకున్నాడు. బ్రెజిల్కు చెందిన క్లాక్ లైవ్ లో రెబెల్ జుగను బ్రిడి ఇటీవలే గిన్నెస్ బుక్ రికార్డ్ సొంతం చేసుకున్నాడు.


 ఏకంగా 1901 మీటర్ల ఎత్తులో రెండు హాట్ ఎయిర్ బెలూన్స్ మధ్య సన్నటి తాడుపై నడిచి ఈ ఘనత సాధించాడు. ఈ ఎత్తు  ప్రపంచంలోనే ఎత్తైన  కట్టడం బుర్జ్ ఖలీఫా కంటే రెండింతలు అధికమని చెప్పాలి.  ఇక ఈ సాహసానికి సంబంధించిన వీడియోని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో పంచుకుంది. ఇక ఇది చూసిన వారు అసలు ఈ ఫీట్ నమ్మశక్యంగా లేదు అంటూ కామెంట్లు పెడుతున్నారు. గిన్నిస్ బుక్ లో రికార్డు సాధించడం కోసం అతడు అతని ప్రాణాలనే పణంగా పెట్టాడు అని మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు..Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: