
వైరల్ వీడియో : బొమ్మ అనుకుని దగ్గరికి వెళ్లాడు.. కానీ చివరికి?
సెల్ఫీ పిచ్చి కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్న ఘటనలో కూడా వెలుగులోకి వస్తున్నాయి. సెల్ఫీ తీసుకోవాలని ఆశతో ఎంతో మందిప్రమాదకర ప్రదేశాలకు వెళ్లడం సెల్ఫీలు తీసుకోవటానికి ప్రయత్నించటం ప్రమాదవశాత్తు చివరికి ప్రాణాలు కోల్పోవడం కూడా జరుగుతోంది. ఇక కొన్ని కొన్ని సార్లు సెల్ఫీలు తీసుకోవాలి అనే మోజులో ప్రమాదం పొంచి ఉంది అన్న విషయాలు కూడా మర్చిపోతూ ఉంటారు చాలామంది.. ఇక్కడ ఇలాంటి ఘటనే జరిగింది. ఆ టూరిస్ట్ పార్క్ లో పర్యటిస్తున్నాడు. ఈ క్రమంలోనే జంతువులు అన్నిటిని కూడా సెల్ఫీ లో బందిస్తున్నాడు. ఈ క్రమంలోనే అటు మొసలిని సెల్ఫీ తీసుకోవాలని అనుకున్నారు.
ఇక బొమ్మ మొసలి అనుకుని దగ్గరికి వెళ్ళాడు. కానీ మొసలి మాత్రం అతని వేటాడి ప్రాణాలు తీయబోయింది. కానీ త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన ఫిలిప్పైన్స్లో వెలుగులోకి వచ్చింది. థిమ్ పార్క్ లో 12 అడుగుల పొడవున్నా మొసలి ఉంది. ఈ మొసలి కదలికలు లేకపోవడం తో అది బొమ్మ అని భావించాడు 68 ఏళ్ళ టూరిస్ట్. ఈ క్రమంలోనే ఏకంగా ఆ మొసలి ఉన్న కొలను లోకి దిగాడు. ఆ మొసలి దగ్గరికి వెళ్లి సెల్ఫీ తీసుకోవాలని భావించాడు. కానీ ఇంతలో ఆ టూరిస్టు చేయిని కరిచింది మొసలి. దీంతో అతని చేతి ముక్కలు గా విరిగి పోగా చర్మానికి కూడా గాయం అయ్యింది. అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు.