100 మంది సంతానం కావాలంటున్న యువతి..!
రష్యాలోని జార్జియాలో నివాసం ఉండే క్రిస్టినా ఓజ్టర్క్ మహిళకు గల్లిప్ ఓజ్టర్క్ తో వివాహం జరిగింది. క్రిస్టినా మొదటి చూపులోనే గల్లిప్ నచ్చడంతో ప్రేమలో పడింది అనంతరం వీరు వివాహం చేసుకొని రష్యాలో నివాసముంటున్నారు. అయితే ఈ మహిళ తన కుటుంబాన్ని విస్తరించడం కోసం ఏకంగా 100 మంది పిల్లల్ని కనాలని భావిస్తోంది. ఇప్పటికే ఈమెకు 11 మంది సంతానం ఉన్నారు. వీరికి రష్యాలో అత్యంత విలాసవంతమైన హోటల్ వ్యాపారాలు ఉన్నాయి. డబ్బుకు ఏ మాత్రం కొదువలేని వీరు ఏకంగా 100 మంది సంతానం కావాలని కోరుకుంటున్నారు.
మొదటగా క్రిస్టినా ఓ బిడ్డకు తల్లయిన తర్వాత సరోగేట్ మదర్ ద్వారా తన సంతానాన్ని అభివృద్ధి చేసుకోవాలని భావించింది. ఈ క్రమంలోనే సరొగేట్ మదర్ ద్వారా మరో పది మంది సంతానానికి తల్లి అయింది.పిల్లలంటే ఎంతో ఇష్టం ఉన్నా క్రిస్టినా ఏకంగా 100 మంది పిల్లలకు జన్మ ఇవ్వాలని భావిస్తోందట. ఈ సరోగేట్ పద్ధతిలోనే పిల్లలకు జన్మనివ్వడానికి ఒక్కో మదర్ కు ఎనిమిది వేల యూరోలు అందిస్తున్నామని గల్లిప్ తెలియజేశారు. సరోగేట్ మదర్ దగ్గర శిశువు కొద్దిరోజులు ఉన్న తర్వాత వారి దగ్గరకు తెచ్చుకుంటామని ఈ సందర్భంగా క్రిస్టినా, గల్లిప్ దంపతులు తెలియజేశారు.