ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిన గూగుల్ ధర తెలిస్తే షాకే..

frame ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిన గూగుల్ ధర తెలిస్తే షాకే..

Suma Kallamadi
ఎలక్ట్రానిక్స్ దిగ్గజం గూగుల్, భారతదేశంలో తన మొదటి ఫోల్డబుల్ ఫోన్, పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్‌ను విడుదల చేసింది. ఫోల్డబుల్ ఫోన్‌లు మార్కెట్‌లో ట్రెండింగ్‌లో ఉన్నాయి. అలాంటి సమయంలో ఈ ఫోన్ వస్తుంది. పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ టెన్సర్ G4 ప్రాసెసర్‌తో చాలా ఫాస్ట్ గా పని చేస్తుంది. ఇందులో 8-అంగుళాల ఇన్నర్ డిస్‌ప్లే, 6.3-అంగుళాల కవర్ డిస్‌ప్లే ఉన్నాయి. ఫోన్‌లో 4650 mAh బ్యాటరీ ఇవ్వగా, ఇది 45-వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. మరి ఇప్పుడు, దాని ఫీచర్లు, ధరను పరిశీలిద్దామా.
పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ గూగుల్ కంపెనీ తయారు చేసిన కొత్త రకమైన స్మార్ట్‌ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఈ ఫోన్‌ను రెండు భాగాలుగా మడత పెట్టవచ్చు, అందుకే దీన్ని ఫోల్డబుల్ ఫోన్ అంటారు. ఈ ఫోన్‌ 16 GB RAM, 256 GB స్టోరేజ్ ఆప్షన్ తో లాంచ్ అయ్యింది. దీని ధర రూ.1,72,999. అంటే యాపిల్ హై ఎండ్ ఐఫోన్ల కంటే ధర ఎక్కువే అంతేకాదు యాపిల్ మ్యాక్ బుక్ ల్యాప్ టాప్ కంటే దీని ధర చాలా ఎక్కువ. ఈ ధరతో సెకండ్ హ్యాండ్ కార్ కూడా కొనుగోలు చేయవచ్చు. దీని ప్రైస్ చాలా ఎక్కువగా పెట్టారని సోషల్ మీడియా యూజర్లు విమర్శిస్తున్నారు.
ఈ ఫోన్‌ను అబ్సిడీన్, పోర్సెలైన్ వంటి రెండు రకాల రంగుల్లో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్‌లో కానీ, క్రోమా లేదా రిలయన్స్ డిజిటల్ స్టోర్‌లలో కానీ కొనుగోలు చేయవచ్చు. ఇది ఆండ్రాయిడ్ 14 అనే ఆపరేటింగ్ సిస్టమ్ తో వస్తుంది. ఫోన్‌ను మడచినప్పుడు కనిపించే చిన్న స్క్రీన్ 6.3 అంగుళాల పరిమాణంలో ఉంటుంది. ఈ స్క్రీన్‌కు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 అనే ప్రత్యేకమైన గ్లాస్‌తో రక్షణ కల్పించారు.
గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ 48MP మెయిన్ కెమెరాతో వస్తుంది. 10.5-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 10.8-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా కూడా ఉన్నాయి. ఫోన్ 5x ఆప్టికల్ జూమ్, 20x సూపర్ రెస్ జూమ్ వంటి ఫీచర్లను అందిస్తుంది. కనెక్టివిటీ కోసం, ఫోన్ 5G, 4G LTE, Wi-Fi 7, బ్లూటూత్ v5.3, NFC, GPS, అల్ట్రా-వైడ్ బ్యాండ్, USB 3.2 టైప్-సి పోర్ట్‌కు మద్దతు ఇస్తుంది. భద్రత కోసం, ఇది ఫేస్ అన్‌లాక్, ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: