మార్కెట్లో ప్రస్తుతం మంచి లాప్ టాప్స్ ఇవే?

మార్కెట్లో ప్రస్తుతం మంచి లాప్ టాప్స్ ఇవే...


ఎం 1 చిప్‌తో కూడిన ఆపిల్ మ్యాక్ బుక్ ఎయిర్ 13.3 ఇంచెస్ రెటినా డిస్‌ప్లే, 8 జీబీ + 256జీబీ ఎస్ఎస్‌డీ స్టోరేజ్‌తో, కోడింగ్ టాస్క్‌ల కోసం మంచి పనితీరును అందించడానికి డిజైన్ చేయబడింది.ఈ ల్యాప్‌టాప్ బ్యాక్‌లిట్ కీబోర్డ్, ఫేస్‌టైమ్ హెచ్‌డీ కెమెరా, ల్యాప్‌టాప్‌నకు సంబంధించి వినియోగం ఇంకా భద్రతను మెరుగుపరిచే టచ్ ఐడీతో సహా ఇంకా గొప్ప ఫీచర్లతో వస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌ను ఆపిల్ పరికరాలలో సులభమైన కనెక్టివిటీని అందించే  పవర్‌హౌస్‌గా చేస్తుంది. ఈ ల్యాప్‌టాప్ ధర విషయానికి వస్తే ప్రస్తుతం రూ.89,989 గా ఉంది.


అలాగే హెచ్‌పీ పెవిలియన్ 14 ఇంటెల్ ఐరిస్ ఎక్స్ఈ గ్రాఫిక్స్‌తో 12వ జెనరేషన్ ఇంటెల్ కోర్ ఐ5-1235యూ ప్రాసెసర్‌తో ఈ లాప్ టాప్ వస్తుంది. ఈ ల్యాప్‌టాప్ వివిధ టాస్క్‌లలో ఎంతో అత్యుత్తమ పనితీరును కలిగి ఉంది. 14-ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేతో వచ్చే ఈ ల్యాప్‌టాప్ 16 జీబీ + 512 జీబీ ఎస్ఎస్‌డీతో వస్తుంది. ముఖ్యంగా సాఫీగా మల్టీ టాస్కింగ్‌తో పాటు మీ అన్ని అవసరాలకు తగినంత స్టోరేజ్ ని కూడా అందిస్తుంది. ఫింగర్‌ప్రింట్ రీడర్, బ్యాక్‌లిట్ కీబోర్డ్ ఇంకా అలాగే బీఅండ్ఓ ట్యూన్డ్ ఆడియో ఉన్నాయి. ఇక ఈ ల్యాప్‌టాప్ విండోస్ 11, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2021తో ముందే ఇన్‌స్టాల్ చేసి వస్తుంది. ఈ ల్యాప్‌టాప్ ధర విషయానికి వస్తే రూ.63,954గా ఉంది.


ఇంకా అలాగే ఆసస్ వివో బుక్ 15 12వ జెన్ ఇంటెల్ కోర్ ఐ7-12650 హెచ్ ప్రాసెసర్‌తో వస్తుంది. ఇది 15.6 అంగుళాల పూర్తి హెచ్‌డీ డిస్‌ప్లేతో 16 జీబీ + 512 జీబీ ఎస్ఎస్‌డీతో వస్తుంది. ఇది మల్టీ టాస్కింగ్ కోసం సరిగ్గా సరిపోతుంది. విండోస్ 11 తో వచ్చే ఈ ల్యాప్‌టాప్ ధర విషయానికి వస్తే రూ.59990గా ఉంది.


హెచ్‌పీ విక్టస్ గేమింగ్ ల్యాప్‌టాప్ విషయానికి వస్తే.. ఇది 12వ జెన్ ఇంటెల్ కోర్ ఐ5-12450 హెచ్ ప్రాసెసర్‌తో పాటు 4 జీబీ నివిడా జీపీయూతో వస్తుంది. గేమింగ్, గ్రాఫిక్స్-ఇంటెన్సివ్ టాస్క్‌లకు అనువుగా ఉండే ఈ ల్యాప్‌టాప్ 15.6 ఇంచెస్ పూర్తి హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇక 16 జీబీ+512 జీబీ ఎస్ఎస్‌డీతో వచ్చే ఈ ల్యాప్‌టాప్ వేగవంతమైన పనితీరును అందిస్తుంది. బ్యాక్‌లిట్ కీబోర్డ్, బీఅండ్ఓ డ్యూయల్ స్పీకర్లు ఇందులో ఉన్నాయి. విండోస్ 11 తో వచ్చే ఈ ల్యాప్‌టాప్ ధర విషయానికి వస్తే మార్కెట్లో రూ.65,480గా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: