సూపర్ టెక్నాలజీ.. ఐరన్ మ్యాన్ లాగా గాల్లో దూసుకుపోతున్న భారత సైనికులు?

praveen
హాలీవుడ్ సినిమాలలో అవెంజర్స్ సిరీస్ కు ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే అవెంజర్స్ లో ఎంతో మంది హీరోలు ఉన్నా ఇక ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడేది మాత్రం ఐర్ మాన్  పాత్రనే . గాల్లో దూసుకుపోతూ ప్రత్యర్థుల భరతం పడుతూ ఉంటాడు. అయితే ఇప్పుడు భారత ఆర్మీ కూడా శత్రువుల భరతం పట్టేందుకు అచ్చం ఐర్ మ్యాన్  లాగానే గాల్లో ఎగురుతుంది. ఎక్కడ తీవ్రవాదులు కనిపిస్తే అక్కడ బాంబుల వర్షం కురిపించేలా భారత సైనికులు గాల్లో దూసుకుపోతున్నారు.

 భారత సైనికులు ఏంటి గాల్లో ఎగరమేంటి కాస్త కన్ఫ్యూషన్ గా ఉంది క్లారిటీగా చెప్పండి అంటారా.. ఇటీవల కాలంలో భారత ఆర్మీకి అధునాతన టెక్నాలజీతో కూడిన ఆయుధాలు అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం. ఈ క్రమంలోనే ఇందుకోసం వేల కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తుంది అన్న విషయాన్ని తెలిసిందే. ఈ క్రమంలోనే భారత సైనికులు అందరికీ కూడా జెడ్ ప్యాక్ సూట్లను అందించింది. ఇక భారత జవాన్లు ఈ జెడ్ ప్యాక్ సూట్లు ధరించి ఏకంగా విమానాల మాదిరిగానే గాల్లోకి ఎగురుతూ ఉన్నారూ.

 ఇటీవల భారత ఆర్మీకి అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ జెడ్ ప్యాక్ సూట్లకు భారత సైన్యం పరీక్షించింది. స్పెషల్ ఫోర్సెస్ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో ఆర్మీ ఎయిర్ బోర్న్ ట్రైనింగ్ స్కూల్లో కొత్త జెడ్ ప్యాక్ సూట్ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఏకంగా అవెంజర్స్ సినిమాలో ఐరన్ మాన్ మాదిరిగానే జెట్ ప్యాక్ సూట్ ను ధరించి అటు భారత సైనికులు ఎంతో విజయవంతంగా గాల్లో ఎగురుతూ దూసుకుపోతున్నారు. సున్నితమైన అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండేందుకు ఇలాంటి స్పెషల్ సూట్లను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సూట్ ఏ సీజన్లోనైనా పనిచేస్తుందట .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: