బుల్లిపిట్ట: చెవి క్లీన్ చేసే అద్భుతమైన పరికరం.. ప్రత్యేకతలు అదుర్స్..!

Divya
ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సందర్భంలో చెవిని క్లీన్ చేసుకోవాలని ఇయర్ బడ్ లను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే చెవి పూర్తిగా క్లీన్ అవుతుందని చెప్పలేమని చెప్పవచ్చు.  ఇందుకోసం కొంతమంది ఆసుపత్రులకు కూడా వెళ్లిన సందర్భాలు చాలానే ఉంటాయి. అయితే ఇకమీదట ఆ అవసరం లేదని ఒక ప్రముఖ దిగ్గజ సంస్ధ తెలియజేస్తోంది..3Mp హెచ్డి కెమెరా 3.5 mm ఆల్ట్రా ఫైన్ లెన్స్ తో పోర్టోనిక్ కంపెనీ చెవిని శుభ్రపరిచే ఒక ప్రత్యేకమైన పరికరాన్ని తయారుచేసింది. Xlife అని పేరుతో దీనిని ప్రారంభించింది.
ఇది మన మొబైల్లో మీ చెవి లోపల చేసుకొని క్లీనింగ్ ని కూడా ప్రత్యేకంగా వీక్షించడానికి సహాయపడుతుందట. ఇది సురక్షితమైన సిలికాన్ చిట్కాను కలిగి ఉంటుంది ఇది మీ చెవిని రోజువారి ఇయర్ వాక్స్ ను శుభ్రం చేయడంలో చాలా సహాయపడుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు. XLIFE పరికరాన్ని అన్ని వయసుల వారు సురక్షితంగా ఉపయోగించుకోవచ్చట. వైద్యుల ప్రకారం వారు చేసేటువంటి పని వల్ల చెవిపోటు కూడా వచ్చే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. ఇక కొంతమంది ఎక్కువగా పిన్ని , పెన్ క్యాప్ తో తీసుకుంటూ.  ఉంటారు వీటివల్ల పలు ప్రమాదాలు కూడా వస్తాయి.
XLIFE పరికరం ఇలాంటి సమస్యలను తొలగిస్తుంది.3 mp కలిగిన ఈ ఫుల్ హెచ్డి కెమెరా పెన్ లెన్స్ తో ఇది చెవిలోపల ఉన్న ప్రతిదానిని స్పష్టంగా చూపిస్తుందట.6-LED స్పాట్ లైట్, 3 యాక్సిస్ గైరో స్కోప్ ను కలిగి ఉంటుందట ఇది చెవి లోపల ఉన్న ప్రతి విషయాన్ని కూడా 360 డిగ్రీస్ లో మనకు చూసే విధంగా సహాయపడుతుందని తెలియజేస్తున్నారు. XLIFE వైఫై 2.4 కనెక్టివిటీని కలిగి ఉంటుంది మీ ఆండ్రాయిడ్ మొబైల్ లేదా ఐఫోన్ కి దీనిని కనెక్ట్ చేసుకోవచ్చు దీంతో చెవిలోపల ఉన్న డస్ట్ ని శుభ్రం. అవసరమైతే దీనిని వీడియో తీసుకోవచ్చు ఫోటోలు కూడా తీసుకోవచ్చట. ఈ పరికరానికి ఒకసారి ఛార్జింగ్ చేస్తే 30 నిమిషాల వరకు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది దీని ధర రూ.1299 రూపాయలు మాత్రమే. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా లభిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: