బుల్లి పిట్ట: అదిరిపోయే అప్డేట్ ను తీసుకు వచ్చిన వాట్సాప్..!!
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ కు ప్రస్తుతం చాలా క్రేజ్ పెరిగిపోయిందా. ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ ను ఉపయోగిస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం టెక్నాలజీకి తగ్గట్టుగా వాట్సప్ సంస్థ కూడా ఎన్నో అప్డేట్లను తీసుకువస్తూనే ఉన్నది. ఇప్పుడు తాజాగా మరొక అదిరిపోయి అప్డేట్ ఫీచర్ ను తమ కస్టమర్ల కోసం తీసుకు రావడం జరుగుతుంది వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ప్రపంచంలో ఎక్కువమంది ఉపయోగించుకుంటున్న మెసేజింగ్ యాప్ వాట్సప్ కి ఆస్థానం దక్కిందని చెప్పవచ్చు. ఇక తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు తమ ఫీచర్ ను తీసుకురావడం వల్ల ఈ యాప్ కు మరింత ఆదరణ లభిస్తుందని చెప్పవచ్చు.. ఇక ప్రైవసీ విషయంలో కూడా వాట్సాప్ పెద్దపీట వేస్తోంది యూజర్ల కోసం. మనం చాటింగ్ చేస్తున్నప్పుడు హెడ్ ఆన్ లైన్ స్టేటస్ పేరుతో తీసుకు వస్తున్న ఈ ఫీచర్ సహాయంతో ఆన్లైన్లో ఉన్న కూడా ఆ విషయాన్ని ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడవచ్చు.. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ వర్షన్..2.22.16.12 కోసం అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ ఫీచర్ యాక్టివ్ చేసుకున్నట్లయితే యూజర్స్ తాము ఆన్లైన్లో ఉన్న విషయాన్ని కూడా ఎవరు కనిపెట్టలేరు.
కేవలం లాస్ట్ సీన్ మాత్రమే హెడ్ చేసుకునే అవకాశం ఉంటుంది.. ఈ వరుసలో ఆన్లైన్ స్టేటస్ ను వాట్సప్ చేర్చడం జరిగింది. అయితే ఈ ఫీచర్ ఉపయోగించుకోవాలి అంటే వాట్సాప్ సెట్టింగ్ లో అకౌంట్ సెక్షన్ లోకి వెళ్లి .. ప్రైవసీ లోకి వెళ్లి అక్కడ లాస్ట్ సీన్ అనే ఆప్షన్ ని ఎంచుకోవాలి. ఈ లాస్ట్ సీన్ ఆప్షన్లు వాట్సాప్ హెడ్ ఆన్లైన్ స్టేటస్ అని ఫీచర్ ను తీసుకువచ్చేందుకు సిద్ధమయ్యింది వాట్సప్ అయితే ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్లో ఈ ఫీచర్ ఉన్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ ఫీచర్ వాట్స్అప్ ఉపయోగించే ప్రతి యూజర్ లకి కూడా అందుబాటులోకి తీసుకురాబోతోంది.