బుల్లి పిట్ట: మీ ఆధార్ లో ఏదైనా మోసం జరిగిందా లేదో ఇలా తెలుసుకోండి..!!

Divya
ప్రస్తుతం మన దగ్గర ఉండే ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఆధార్ కార్డు అనేది ఒకటీ. ఆధార్ అన్నిటికీ ఉపయోగ పడే ఒక డాక్యుమెంటు గా ఉన్నది. ప్రస్తుతం ప్రభుత్వ స్కీములు నుండి ప్రభుత్వ బ్యాంకింగ్ అకౌంటు వరకు అన్నిటికీ ఆధార్ కార్డు లింక్ చేయవలసిన అవసరం ఉన్నది.. అయితే నిజానికి ఆధార్ కార్డు లేకపోతే చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. అయితే ఆధార్ కి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది కాబట్టి.. దాన్ని దుర్వినియోగం చేయకుండా చూసేందుకు ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటాము.

ఆధార్ కార్డు ఉండడం వల్ల మనకు  ప్లస్ ఏమిటంటే.. మీరు మీ ఆధార్ కార్డు ఎప్పుడు  ఎక్కడ ఉపయోగించారు అనే వాటి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. మీరు కనుక ఎప్పుడైనా మీ ఆధార్ కార్డు ను దుర్వినియోగం అయింది అని అనుమానం వచ్చి నట్లు అయితే ఈ విధంగా వాటిని తెలుసుకోవచ్చు..

ఆధార్ కార్డ్ వెబ్సైట్లోకి వెళ్లి గత ఆరు నెలల నుంచి మన ఆధార్ కార్డు ఎక్కడ ఎక్కడ ఉపయోగించాము అనే విషయాలను మనం తెలుసుకోవచ్చు. దీని ద్వారా మన ఆధార్ కార్డుల్లో ఏదైనా మోసం జరిగిందా లేదా అనే విషయాన్ని కూడా తెలుసుకోవచ్చు. ఎలా చెక్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం.
1). ముందుగా uidai పోర్టల్ లోకి వెళ్ళాలి.
2). ఆ తర్వాత ఆ వెబ్ సైట్  లోకి వెళ్లి ఆధార్ సర్వీస్ ని ఎంపిక చేసుకోవాలి.
3). అక్కడ 8 వ వరుసలో మనకు ఆధార్ అథెంటిఫికేషన్ హిస్టరీ కనిపిస్తుంది. వాటి పైన క్లిక్ చేయాలి.
4). ఆ తర్వాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేయవలసి ఉంటుంది.
5). ఆ తర్వాత క్యాప్చా కోడ్ కూడా ఎంటర్ చేయాలి.
6). ఎప్పటి నుంచి మన హిస్టరీ కావాలనుకుంటున్నారో అప్పటినుంచి అక్కడ ఎంటర్ చేసి మళ్ళీ ఎంటర్ బటన్ నొక్కవలసి ఉంటుంది.
7). ఆ తర్వాత మనకు ఓటిపి వస్తుంది వాటిని ఎంటర్ చేయడం ద్వారా మన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: