బుల్లి పిట్ట: జియో ఫోన్ ను ఇలా బుక్ చేసుకోండి..!!

Divya
దీపావళి కానుక నుంచి రిలయన్స్ సంస్థ జియో మొబైల్ ను తక్కువ ధరకే విడుదల చేసి ఉంది. ఈ మొబైల్ ను రూ.1,999 రూపాయలకే మనం సొంతం చేసుకోవచ్చు. ఆ తర్వాత EMI ను 300 నుంచి 600 రూపాయల ఆప్షన్ ను అందిస్తోంది. ఈ ఆప్షన్ను 18 మాసాల నుంచి 24 మాసాల వరకు EMI సదుపాయాన్ని కల్పించింది. ముఖ్యంగా వీరికి రీఛార్జ్ వంటి బెనిఫిట్స్ ను కూడా కల్పిస్తోంది. ఒకవేళ Emi ఆప్షన్ వద్దనుకుంటే ఈ మొబైల్ కోసం 6,499 రూపాయలు చెల్లిస్తే చాలు. ఈ మొబైల్ ని ఎలా ఎలా బుక్ చేసుకోవాలి చూద్దాం.

1). ముందుగా మనం https://www.jio.com అనే వెబ్ సైట్ లోకి వెళ్లి ఓపెన్ చేయాలి.

2). అలా ఓపెన్ చేసిన తర్వాత హోం పేజీ లో కింది వైపు వస్తే..iam interested అదే వాటిపై క్లిక్ చేయాలి.

3). అలా ఓపెన్ చేసిన తర్వాత మన పేరును, మన మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక ఈ మొబైల్ నెంబర్ కి ఓటీపీ నెంబర్ వస్తుంది.

4). ఆ తర్వాత మన మొబైల్ నెంబర్ కు వచ్చిన ఓటీపీ నెంబర్ ను ఎంటర్ చేయాలి.

5). అక్కడ మన బయోడేటా అంతా ఎంటర్ చేయాలి.

6). ఇక మన అడ్రస్, పిన్ కోడ్ ఎంటర్ చేసి submit button పైన క్లిక్ చేయవలసి ఉంటుంది.

7). ఆ తర్వాత జియో ఒ నుంచి ఓకే అయినట్లుగా మనకు మెసేజ్ వస్తుంది. ఆ తర్వాత దగ్గర లో ఉన్నటువంటి జియో స్టోర్ నుంచి మనకి కాల్ చేస్తారు.ఆ తరువాత ఈ మొబైల్ ని మనమే స్టోర్ కి వెళ్లి తీసుకోవాలి.

ఈ jio మొబైల్ ని వాట్సాప్ ద్వారా కూడా మనం బుక్ చేసుకోవచ్చు.70182-70182 నెంబర్ ద్వారా బుక్  చేసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: