ఈ ట్రైన్ తో ఢిల్లీ నుంచి ముంబైకి గంటలో వెళ్లొచ్చు..

కాలం అనేది రోజు రోజుకి మారుతోంది.. టెక్నాలజీ ఇప్పుడు బాగా అభివృద్ధి చెందుతుంది.ఎప్పుడూ కూడా కొత్తద‌నాన్ని వేగాన్ని కోరుకుంటుంది. అంత‌ర్జాతీయంగా ర‌వాణా రంగంలోనూ అనేక మార్పులు అనేవి వ‌స్తున్నాయి. వేగ‌వంత‌మైన రవాణా అనేది ఇప్పుడు చాలా అవ‌స‌రం. అందుకే ఈ నేప‌థ్యంలో అతిపెద్ద కంపెనీలు నిర్మాణ రంగంలో హైప‌ర్‌లూప్‌ల నిర్మించే ప‌నిలో నిమగ్నమయ్యాయి. ఇక అందులో భాగంగానే ఇప్పుడు వ‌ర్జిన్ గ్రూప్ హైపర్ లూప్ రైలు అభివృద్ధి పనులను బాగా చేస్తోంది. 2014 నుంచి ఈ ప‌నులను చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ ప‌నులు ఇంకా స్టార్టింగ్ ద‌శ‌లోనే ఉన్నాయి. ఈ హైప‌ర్‌లైన్ అనేది పూర్త‌యితే ఖచ్చితంగా ర‌వాణా రంగంలో పెను మార్పులు అనేవి తీసుకురాబోతున్నాయి.ఇక సరికొత్త టెక్నాలజీని వాడుతూ వేగ‌వంత‌మైన ర‌వాణాను అందించ‌డ‌మే హైప‌ర్‌లైన్ లక్ష్యం. ఇది హైస్పీడ్ రైల్ కంటే కూడా చాలా వేగ‌వంత‌మైంది. మామూలు రైలు కంటే కూడా ప‌ది రెట్లు వేగంగా గ‌మ్యం చేర‌గ‌ల‌దు. హైపర్ లూప్ అనేది ఒక ప్రత్యేక నిర్మాణం. బయట రైలు మార్గంపై గానీ.. రైలుకు వెలుపల గానీ ఎలాంటి గాలి అసలుండదు.

ఇక దీని కారణంగా దాని మీద ఏరోడైనమిక్ ప్రభావం అనేది అసలు ఉండదు. అంటే ఏ విధమైన బాహ్యపరమైన ఒత్తిడి అనేది రైలుపైన గానీ..అలాగే దాని వేగంపైన గానీ ప్రభావం చూపే అవకాశం అయితే అసలు లేదు.ఇక ఈ కారణంగానే హైపర్ లూప్ టెక్నాలజీలో రైలు చాలా ఎక్కువ వేగంగా ప్రయాణిస్తుంది. హైపర్ లూప్ పాడ్స్ వేగాన్ని పెంచడానికి అయస్కాంత లెవిటేషన్ ఇంకా ప్రొపల్షన్ టెక్నాలజీని వ‌ర్జిన్ వాడనుంది. ఇక ఈ హైపర్ లూప్ వాక్యూం రూపంలో ఉన్న గొట్టాలలో ప్రయాణించడం జరుగుతుంది.అంటే హైప‌ర్ లూప్ అనేది గంట‌కు 1,000 కిలోమీట‌ర్లు వేగంతో ప్ర‌యాణించ‌గ‌ల‌దు. ఇక ఈ టెక్నాలజీ అనేక వాణిజ్య జెట్ల‌కు పోటీని ఇవ్వ‌గ‌ల‌దు అన‌డంలో ఎలాంటి సందేహం అనేది అవసరం లేదు.ఇప్పుడు ట్ర‌య‌ల్ ర‌న్ జ‌రుగుతున్న ప్ర‌యోగం హైప‌ర్ లూప్ పోర్ట‌ల్‌లోని రూట్ అంచనా అనేది ఢిల్లీ నుంచి ముంబైకి 1,153 కిలోమీట‌ర్ల దూరం ఉంది. మీరు హైప‌ర్ లూప్ పోర్ట‌ల్  ద్వారా ప్ర‌యాణిస్తే కేవ‌లం గంటా 22 నిమిషాల్లోనే ఈ దూరాన్ని చాలా ఈజీగా చేరుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: