కళ్లు చెదిరే ఫీచర్లతో షియోమి స్మార్ట్ టీవీ లాంఛ్..
ఇదే కార్యక్రమంలో ఎంఐ 11 ఎక్స్ సిరీస్ ఫోన్లను కూడా లాంఛ్ చేసింది. సంస్థ నుంచి ఇప్పటివరకు విడుదలైన అన్ని స్మార్ట్ టీవీల్లో కెల్లా ఇదే అతిపెద్ద టీవీ కావడం విశేషం. అంతేకాక, షియోమికి చెందిన అత్యంత ఖరీదైన టీవీ కూడా ఇదేదని సంస్థ తెలిపింది.టీవీలో సినిమా చూసేటప్పుడు థియేటర్లో చూస్తోన్న అనుభూతిని ఇస్తుంది. దీంట్లో 30 వాట్ల సిక్స్ స్పీకర్ ఆడియో సిస్టమ్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వంటి ఫీచర్లను అందించింది.. కాగా, ఈ టీవీ గురించి పూర్తి వివరాలను కంపెనీ గత ఏడాది వెలువరచింది.
ఈ డివైజ్ ఆండ్రాయిడ్ టీవీ 10 ఓఎస్తో నడుస్తుంది. ప్యాచ్‌వాల్ లేటెస్ట్ వెర్షన్‌తో పనిచేస్తుంది. దీని ఇంటర్ఫేస్ 25+ కంటెంట్ ప్లాట్ఫామ్లకు యాక్సెస్ ఇస్తుంది. యూనివర్సల్ సెర్చ్, యూజర్ సెంటర్, కిడ్స్ మోడ్, స్మార్ట్ రికమండేషన్స్, లైవ్ టివి వంటి ఫీచర్లను అందిస్తుంది.దీనిలో 30 వాట్ల సిక్స్ స్పీకర్ సిస్టమ్‌ను కూడా చేర్చారు. ఈ టీవీని అల్యూమినియం అల్లాయ్తో రూపొందించారు. దీనికి 'ఫ్లోటింగ్ స్టాండ్' అమర్చారు. తద్వారా ఎక్కడికంటే అక్కడికి సులభంగా తీసుకెళ్లవచ్చు..
ఎంఐ క్యూఎల్‌ఇడి టివి 75 స్మార్ట్టీవీ ధరను రూ .1,19,999గా నిర్ణయించింది. దీన్ని ఎంఐ.కామ్, ఎంఐ హోమ్, ఫ్లిప్‌కార్ట్‌లలో కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ టీవీ ఏప్రిల్ 27 మధ్యాహ్నం 12 గంటల నుంచి అమ్మకానికి సిద్ధంగా ఉంటుంది. ప్రారంభ ఆఫర్లలో భాగంగా హెచ్‌డిఎఫ్‌సి డెబిట్, క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేసే వారికి రూ .7,500 వరకు క్యాష్‌బ్యాక్, 12 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను అందిస్తుంది.