గూగుల్ క్రోమ్ బ్రౌజర్ కి కొత్త అప్డేట్..!
ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది ఉపయోగించే గూగుల్ క్రోమ్ లో ట్యాబ్ గ్రూప్స్ అనే ఒక సరికొత్త అప్డేట్ ని గూగుల్ సంస్థ వారు తాజాగా విడుదల చేసారు. ఈ అప్డేట్ తో ప్రతియొక్క ఒక వినియోగదారుడు బ్రౌజర్లోనే ట్యాబ్స్ ఆర్గనైజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఫీచర్ అనేది వర్క్ చేసుకునేవారికి చాలా ఉపయోగపడుతుందని... ఇది ఎప్పుడో రావాల్సి ఉందని వినియోగదారులు తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు. 70 శాతం డిస్క్ టాప్ వినియోగదారులు గూగుల్ క్రోమ్ బ్రౌసర్ నే వినియోగిస్తారు.
టాబ్స్ ని ఆర్గనైజ్ చేసేందుకు మీరు లెఫ్ట్ టాప్ కార్నర్ లో ఉన్న ప్లస్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆపై కావాల్సినన్ని టాబ్స్ ఓపెన్ చేయండి. ఆ తరువాత మొదటి ట్యాబ్ పై కర్సర్ తీసుకెళ్లి రైట్ క్లిక్ ఇవ్వండి. అప్పుడు మీకు "Add Tab to Group" అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయగానే... గ్రే కలర్ లో ఒక సర్కిల్ డాట్ ట్యాబ్ ముందు భాగంలో కనిపిస్తుంది. ఆ గ్రే సర్కిల్ పై క్లిక్ చేయగానే... నేమ్ యాడ్ చేయండి, కలర్ యాడ్ చేయండి అనే ఆప్షన్స్ వస్తాయి.
మీరు కంప్యూటర్ పై వర్క్ చేసేవారైతే WORK అనే పేరు ట్యాబ్ గ్రూప్ కి పెట్టండి. ఆ వర్క్ ట్యాబ్ కి మీకు అవసరమైన వెబ్సైట్స్ ఓపెన్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. అలా ఇంకా ఎన్నో టాబ్స్ చాలా చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. వర్క్ కి సంబందించిన ట్యాబ్స్ క్లోజ్ చేయకుండానే పర్సనల్ ట్యాబ్స్ ఓపెన్ చేసుకునే సౌకర్యం ఈ ఫీచర్ ద్వారా లభిస్తుంది. ఈజీ గా గుర్తుపట్టేందుకు ప్రతి ట్యాబు కి మికిష్టమైన కలర్ యాడ్ చేయవచ్చు. ప్రస్తుతం విండోస్, మైక్రోసాఫ్ట్, లైనక్స్ లలో ఈ ఫీచర్ లభిస్తుంది. ఏది ఏమైనా ఈ ఫీచర్ వల్ల చాలా టైమ్ సేవ్/ఆదా అవుతుంది.