టీవీ: పెళ్లిపై ఎట్టకేలకు ఓపెన్ అయిన యాంకర్ రష్మి..!
గతంలో సుధీర్, రష్మీ జంటకు భారీ క్రేజీ ఉండేది.. హీరోగా సుధీర్ పలు సినిమాలను నటించడం వల్ల ఈ జంటకు బ్రేక్ పడింది.. అయినప్పటికీ కూడా అప్పుడప్పుడు పలు రకాల కార్యక్రమాలకు అతిథిగా వస్తున్నారు సుధీర్. గతంలో సుధీర్, రష్మీ జంట చూసిన చాలామంది వివాహం చేసుకుంటారని అనుకున్నారు. కానీ అదంతా కూడా కేవలం తెరపైన మాత్రమే అన్నట్లుగా తెలిపారు. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీకి సంబంధించి ఒక ప్రోమోని రిలీజ్ చేయగా ఇది కార్తీక పౌర్ణమికి సంబంధించి ప్రోమోని రిలీజ్ చేశారు.
మొదట లేడీ కంటెస్టెంట్ తో నీటిలో దీపాలను వదులుతూ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు చెబుతూ ఉంటారు.. అలాగే రష్మీ కూడా వచ్చిన కంటెస్టెంట్లతో నీళ్లలో దీపాలను వదులుతూ ఉంటుంది అలా తన మనసులోని కోరికలు తెలుపుతూ తన మనసులో ఎవరైతే ఉన్నారో వారిని భర్తగా రావాలని దేవుడని కోరుకుంటుంది.. ఆ తర్వాత రాంప్రసాద్ ఎవరిని కోరుకుంటున్నారు రష్మీ అని అడగగా. మూ పేరు చెప్పకుండా రష్మి సిగ్గుపడుతూ ఉండడంతో.. పోలికలన్న చెప్పమని నూకరాజు అడగగా తన కాబోయే భర్త గుర్రం మీద వస్తాడు అంటూ రష్మి తెరిపింది.. వెంటనే జడ్జిగా ఉన్న ఇంద్రజ అది గుర్రం ఏమో కాదు గోట్ యో చూడండి అంటూ సెటైర్లు వేయడం జరిగింది. మొత్తానికి రష్మీ పెళ్లి చేసుకోబోయేది ఎవరో తెలియాలి అంటే ఈ పూర్తి ఎపిసోడ్ రావాల్సిందే.