టీవీ: బుల్లితెర నటి శ్రీవాణి నెల సంపాదన ఎన్ని లక్షలో తెలుసా..?

Divya
ఈ మధ్యకాలంలో చాలామంది సెలబ్రిటీలు కూడా పెద్ద ఎత్తున సినిమాలలో సీరియల్స్ లో కూడా నటించడానికి మక్కువ చూపుతున్నారు. అలాగే చాలామంది యూట్యూబ్ ఛానల్స్ ని కూడా మెయింటైన్ చేస్తూ భారీగానే నెలనెలా ఆదాయాన్ని సంపాదిస్తూ ఉన్నారు. ముఖ్యంగా తమకు ఇష్టమైన అన్ని విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటున్నారు. ఈ క్రమంలోనే బుల్లితెర నటీనటులు ,యాంకర్స్ ,క్యారెక్టర్ ఆర్టిస్టు వంటి వారు కూడా ఇలా భారీగానే సంపాదిస్తున్నారు. అలాంటివారిలో బుల్లితెర నటి శ్రీవాణి, విక్రమ్ కూడా ఒకరు.

శ్రీవాణి ,విక్రమాదిత్య ఇద్దరు కూడా బుల్లితెర పైన నటీనటులుగానే కొనసాగుతున్నారు. శ్రీవాణి పలు రకాల సీరియల్స్ లో నటిస్తూ ఉండగా విక్రమ్ మాత్రం ఒక హోటల్ నడుపుతున్నారట. వీరికి ఒక కుమార్తె కూడా ఉన్నది. శ్రీవాణి ఒక యూట్యూబ్ ఛానల్ ని రన్ చేస్తూ తనకు సంబంధించిన అన్ని విషయాలను రెస్టారెంట్ కి సంబంధించిన విషయాలను కూడా అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీవాణి నువ్వు మధ్య తరగతి కుటుంబానికి చెందిన వారమే అని తమకు ఉన్న దాంట్లో చాలా ఆనందంగా ఉంటామని ఎలాంటి గొప్పలకి పోమంటూ తెలియజేశారు.

అలాగే యూట్యూబ్ ఛానల్ ద్వారా భారీగానే ఆదాయం వస్తుందని తెలియజేసింది శ్రీవాణి మాట్లాడుతూ తాము యూట్యూబ్ ద్వారా ప్రతినెల 30 నుంచి 50 లక్షల లోపు సంపాదిస్తామంటూ వెల్లడించింది. ప్రతి ఏడాది కనీసంరూ.3 కోట్ల రూపాయలకు పైగా సంపాదిస్తున్నారన్నమాట.అయితే ఈ విషయం విన్న అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ ,యంగ్ హీరోయిన్స్ కి కూడా మీ ముందు పనికిరారు అంటూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అలా వచ్చిన డబ్బులతో తాము పొలాలు ఇల్లు కట్టుకోవడం వంటివి చేస్తూ ఉన్నామంటూ తెలియజేశారు. అయితే శ్రీవాణి చెప్పిన ఈ వాక్యాలకు అభిమానులు కూడా ఆమె పైన ప్రశంసిస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: