టీవీ: యాంకర్స్ నుంచి హీరోయిన్స్ గా మారిన సెలబ్రిటీస్ వీళ్ళే..!
నిహారిక:
మెగా డాటర్ నిహారిక ఇండస్ట్రీకి యాంకర్ గా వచ్చి ఆ తర్వాత హీరోయిన్ గా మారిపోయింది. ఒక డాన్స్ షోకి బుల్లితెరపై యాంకర్ గా పనిచేసిన ఈమె తన యాంకరింగ్ తో అందరినీ ఆకట్టుకొని.. ఒక మనసు సినిమాతో హీరోయిన్గా మారింది. ఇప్పుడు నిర్మాతగా చలామణి అవుతుంది.
రెజీనా కస్సాండ్రా:
ఒకప్పుడు బుల్లితెర యాంకర్ గా పనిచేసిన ఈమె ఒక చానల్లో క్విజ్ ప్రోగ్రాం కి యాంకర్ గా పనిచేసి మెప్పించింది. ఆ తర్వాత కందనాల్ ముదల్ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమై.. ఆ తర్వాత శివ మనసులో శృతి అనే చిత్రంతో హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.
కలర్స్ స్వాతి:
చిన్న వయసులోనే ఇండస్ట్రీకి వచ్చిన ఈమె ప్రముఖ టీవీ ఛానల్ లో కలర్స్ అనే ప్రోగ్రాంకి యాంకర్ గా పనిచేసి .. ఆ తర్వాత తెలుగు నాట సూపర్ పాపులారిటీ దక్కించుకుంది. ఇక అప్పటి నుంచే ఆమె పేరు ముందు కలర్స్ అనే పదం జోడించబడింది. ఇక యాంకర్ తర్వాత సినిమా రంగంలో అనేక పాత్రలు పోషించిన ఈమె క్యారెక్టర్ ఆర్టిస్టుగా , సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా గుర్తింపు తెచ్చుకొని అష్టా చమ్మా చిత్రంతో హీరోయిన్గా మారిపోయింది. ఇక ఈమె తో పాటూ మరెంతో మంది యాంకర్ గా కెరియర్ మొదలుపెట్టి హీరోయిన్లుగా కొనసాగుతున్నారు.