టీవీ: నేను ఆడపులిని నేనేంటో చూపిస్తా - అనసూయ..!

Divya
అనసూయ ఈమధ్య కాలంలో తరచూ వివాదాల్లో ఇరుక్కుంటున్నారనే చెప్పాలి.. మొన్నటికి మొన్న ఆంటీ అంటూ తెగ ట్రోల్ కి గురైన ఈమె ఇప్పుడు మరొకసారి వివాదంలో చిక్కుకుందని చెప్పవచ్చు. ఇప్పుడు తాజాగా మరొక సంచలన పోస్ట్ చేసి మరింత ఘాటుగా స్పందిస్తోంది ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే విజయ్ దేవరకొండపై అనసూయ పోరాటం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఆమె వివాదాన్ని రోజు రోజుకు పెంచుకుంటూ పోతున్నారని చెప్పాలి. తాజాగా మరొకసారి ఘాటైన వ్యాఖ్యలు చేసిన ఈమె ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో సుదీర్ఘ హెచ్చరిక తో సందేశం పోస్ట్ చేయడం ఇప్పుడు మరింత వైరల్ గా మారింది..

అనసూయ పోస్ట్ ను మనం పరిశీలించినట్లయితే.. నువ్వు చేసిన తప్పు ఒప్పుకునే వరకు నేను ఇలాగే చేస్తూనే ఉంటాను. దీనివల్ల నేను మరింత వ్యతిరేకతను ఎదుర్కొంటానని తెలుసు..అయినా  నేను ఏమాత్రం తగ్గను.. నువ్వు చేసిన దాని నుండి అసలు తప్పించుకోలేవు.. న్యాయం, ధర్మం మీద నాకు నమ్మకం ఉంది.. కన్నీళ్లు పెట్టుకొని సింపతి పొందడానికి నేను మోసగత్తెను కాదు నేను ఆడ పులిని.. నేనేంటో చూపిస్తాను మీరు నన్ను ఎంతకు క్రిందకు లాగినా.. బురద చల్లినా పోరాటం మాత్రం ఆపను.
ఈ వివాదంలో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు తెలుసుకునే రోజు తప్పకుండా వస్తుంది l..ఆ నమ్మకం నాకు ఉంది నేను అటెన్షన్ కోరుకుంటున్నాను కానీ మీరు అనుకుంటున్నట్లు కాదు మరీ ముఖ్యంగా టాలెంట్ , నా వర్క్ నాకు అటెన్షన్ తప్పకుండా తెచ్చి పెడతాయి.. నన్ను టార్గెట్ చేశారు సహించాను.. ఇప్పుడు నాలోని అమ్మను టార్గెట్ చేస్తున్నారు తల్లి తిరగబడితే ఎలా ఉంటుందో మీకు తప్పకుండా రుచి చూపిస్తాను... డబ్బులు ఇచ్చి నన్ను ట్రోల్ చేయించడానికి నేనేమీ బలహీనురాలిని కాదు అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు అనసూయ.. దీన్ని బట్టి చూస్తే అనసూయ ఇప్పట్లో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు అన్నట్లుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: