టీవీ: స్కిట్ లో తన తల్లితో కంటతడి పెట్టించిన ఇమాన్యుయల్..!!
ఇక ఇమాన్యుయేల్ కి ఎక్కువగా ఇంత పేరు రావడానికి ముఖ్య కారణం వర్ష అని చెప్పవచ్చు వీరిద్దరి తెరమీద చేసే రచ్చ మామూలుగా ఉండదు.. ఇక అంతే కాకుండా వీరిద్దరి మధ్య జరిగే కొన్ని సన్నివేశాలు గానీ చూస్తే వీరిద్దరు ఖచ్చితంగా ప్రేమలో ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ వీరి కాంబినేషన్లో వచ్చే స్కిట్లు మాత్రం కాస్త అతిగా ఉంటాయని ప్రేక్షకుల నుండి కామెంట్లు వినిపిస్తూ ఉంటాయి. ఇక ఇద్దరూ కేవలం జబర్దస్త్ షో లోనే కాకుండా తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో కూడా బాగా రెచ్చిపోయారు. దీంత ఇమ్మానుయేల్ తల్లి బాగా ఎమోషనల్ అయినట్లుగా కనిపిస్తోంది.
తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ కి సంబంధించి ఒక ప్రోమో వైరల్ గా మారుతోంది.. ఉమెన్స్ డే సందర్భంగా పలువురు కామెడీ షో లో కనిపించడం జరుగుతోంది. ఇక ఇందులో ఇమ్మాన్యుయేల్ తల్లి కూడా రావడం జరిగింది.. తన కొడుకు మీదే కొన్ని కౌంటర్లు వేస్తే వర్ష ను కూడా మధ్యలోకి లాగింది. ఇక ఇమ్మానియేల్ షో లో భాగంగా ఒక ఎమోషనల్ స్కిట్ చేయడం జరిగింది. తన భార్య తల్లి ని చూసే విధానం లో స్కిట్ చేయడం జరిగింది. ఈ స్కిట్టు చూసిన ఇమాన్యుల్ తల్లి బాగా ఎమోషనల్ అయినట్లు కనిపిస్తోంది.