టీవీ:ఆ కమెడియన్ పరువు ఘోరంగా తీసేసిన అషూరెడ్డి..!!

Divya
బుల్లితెరపై మా టీవీలో ప్రసారమయ్యే.. కామెడీ స్టార్స్ షో గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందులో పలువురు జబర్దస్త్ కమెడియన్స్ తో పాటు, పటాస్ కామెడీయన్స్ కూడా ఈ షోలో నటిస్తున్నారు. అంతేకాకుండా వీరు వేసే పంచులకు ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుతూ ఉంటారు. అలా నవ్వించే వారిలో కమెడియన్ ఎక్స్ ప్రెస్ హరి కూడా ఒకరు. ఈ కమెడియన్ సోషల్ మీడియా ద్వారా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఇక ఆషురెడ్డి కూడా అంతే ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. తాజాగా ఈ జంట గురించి కొన్ని విషయాలు కూడా బాగా ట్రెండింగ్ గా మారుతూనే ఉంటాయి.

ఇక ఆషు రెడ్డి పేరుని హరి తన గుండెల మీద టాటూ కూడా వేయించుకోవడం ఆమధ్య వైరల్ గా మారింది. ఇక అంతే కాకుండా అతడి కోసం ఆషు ఒక బైక్ ను కూడా కొనిచ్చింది. అలా టాటూ వేయించుకోవడంతో ఆమె లాగి కొట్టడం కూడా జరిగింది. ఇలాంటి చిన్న చిన్న కారణాల వల్లే ఈ జంట బాగా పాపులర్ గా మారింది. అయితే వీరిద్దరి మధ్య కేవలం ఉన్నది ఫ్రెండ్షిప్ ఏనా, లేక మరి ఏమైనా ఉందా అనే విషయం మాత్రం క్లారిటీగా రాలేదు. కానీ వీరిద్దరూ కలిసి చేసే పనుల వల్ల తరచు బాగా పాపులర్ గా మారుతూ ఉంటారు.
బుల్లితెరపై ప్రసారమయ్యే కామెడీ స్టార్, హ్యాపీడేస్ షో తో మరింత పాపులర్ అయ్యారు వీరు. ఇక ఆషురెడ్డి అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కొన్ని విచిత్రమైన ఫోటోలు పెడుతూ ఉంటుంది. తాజాగా ఆషు రెడ్డి తన చేతిలో చీపురు పట్టుకొని, కొన్ని పాత్రలు తోమి నట్టు గా కొన్ని ఫోటోలను షేర్ చేయడంతో హరి పుష్ప సినిమాలో శ్రీవల్లి గా ఉన్నావు రా అని అనగా..ఇక ఈ విషయంపై ఆషురెడ్డి నువ్వు కూడా చీపురు పట్టుకుంటే..చీపురు కే అందం కానీ నీకు కాదని రివర్స్ పంచ్ వేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: