బిగ్ బాస్ 5: సన్నీ ఫ్యాన్స్ పవర్ రుచి చూసిన కమెడియన్ సుదర్శన్ ?

VAMSI
బిగ్ బాస్ సీజన్ ఫైవ్ యమ స్పీడ్ మీదుంది. అందులోనూ గేమ్ చివరి దశకు చేరుకోవడంతో అందరి పర్ఫార్మెన్స్ పీక్స్ లో ఉంటుంది. ఇక షోలో ఇంటి సభ్యుల విషయానికి వస్తే అనూహ్యంగా ఎవరూ ఊహించని రీతిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్నారు సన్ని. ప్రస్తుతం సన్ని హౌజ్ లో ఉన్నారు కాబట్టి బహుశా ఈ విషయం అతనికి తెలిసి ఉండకపోవచ్చు. షన్ను, సిరి, శ్రీ రామ్ చంద్ర, అనీ మాస్టర్ అంతా కలసి ఎంతసేపు సన్నీని టార్గెట్ చేస్తూ కయ్యాలు దువ్వుతూ ఉండటంతో ఇది చూస్తున్న ప్రేక్షకులకు తెలియకుండానే సన్ని పై ఒక సింపతీ అనేది క్రియేట్ అయ్యింది. అందులోనూ అతడు ఏది అనిపించినా ముఖంపై చెప్పేసి ఎప్పటికప్పుడు ఆ ఎమోషన్ ని వదిలేస్తాడు.
అంతే కానీ క్యారీ ఫార్వర్డ్ చేయడు. సో అతడికి బయట అభిమానులు ఎక్కువయ్యారు. దాంతో ఎవరైనా సన్నీపై కస్సు బస్సుమంటూ అంటే చాలు బయట వాళ్ళని ట్రోల్స్ చేస్తుంటారు. అయితే ఇపుడు మరోసారి ఇదే తరహాలో ఓ సెలబ్రిటీని తిట్టిపోస్తున్నారు  సన్ని అభిమానులు. నిన్న బిగ్ బాస్ స్టేజ్ పైకి 'అనుభవించు రాజా' టీం వచ్చి సందడి చేసింది.  ఈ మూవీ నుండి హీరో రాజ్‌ తరుణ్‌, నటుడు నెల్లూరు సుదర్శన్‌ లు గెస్ట్ లుగా  విచ్చేసి కాసేపు హౌస్‌మేట్స్‌తో  కబుర్లు చెప్పుకుని కోలాహలం చేశారు. అప్పటి వరకు అంతా బాగానే ఉంది. కానీ మాట్లాడుతూ మాట్లాడుతూ  కాజల్‌ -సన్నీల రిలేషన్‌ ను గురించి తప్పుబడుతూ మాటల మధ్యలో సుదర్శన్‌ కామెంట్ చేశారు.
కానీ ఆ యాంగిల్ లో సన్ని , కాజల్ పై ఎప్పుడూ ఎవరికీ అనిపించనిది ఇపుడు కొత్తగా...సుదర్శన్ ఆ మాట అనడంతో విషయం కాస్త వైరల్ గా మారింది. కాజల్ అలిగిన ప్రతిసారి సన్నీ వచ్చి తనని మెల్లగా  ఓదార్చడం..అదో టైప్ లో రొమాన్స్‌ బాగుంది..అనడంతో వెంటనే సన్నీ స్పందించి ..అలా ఏమి లేదండి.. మాది బ్రదర్‌ అండ్‌ సిస్టర్‌ రిలేషన్‌షిప్  అంటూ చెప్పారు. సన్ని లైట్ తీసుకున్నప్పటికీ  నెటిజన్లు మాత్రం నటుడు సుదర్శన్ పై మండిపడుతున్నారు. సినిమా ప్రమోషన్ కి వచ్చి ఆ పని పక్కన పెట్టి తెలిసి తెలియకుండా ఈ పిచ్చి కామెంట్స్ ఏమిటంటూ... అసలు షో ఎప్పుడైనా చూసావా అంటూ ఫైర్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: