బిగ్ బాస్ షోపై భగ్గుమన్న నారాయణ..!

Suma Kallamadi
బుల్లితెరపై తనదైన శైలిలో దూసుకెళ్తున్న షో బిగ్ బాస్. విజయవంతంగా మూడు సీజన్లు పూర్తి చేసుకున్నా ఈ షో ప్రస్తుతం నాలుగో సీజన్ లో అడుగు పెట్టింది. అంగరంగవైభవంగా బిగ్ బాస్‌ షోని ప్రారంభించారు. అది చూస్తుంటే.. హిమాలయంలో ఉండే సాంస్కృతిక సంఘాన్ని తీసుకుని వచ్చి ఈ మురికి గుంటలో పడేశారు. ఇది ఎంత విలాసంగా ఉందంటే.. విజయ్ మాల్యా జీవించే భవనాలు ఎంత విలాసంగా ఉన్నాయో అని అన్నారు. బిగ్ బాస్ హౌస్‌ కూడా అలాగే ఉంది. యువతీ యువకుల్ని తీసుకొచ్చి అందులో పెట్టారు. వందరోజుల పాటు అదే ఇంట్లో ఉంచుతారట.
ఇక సినిమా యాక్టర్ నాగార్జున ఓ యువకుడిని పిలిపించి. ముగ్గురు సినిమా హీరోయిన్లను చూపించి వీళ్లతో నీకు ఏం చేయాలని పిస్తుందని అడిగాడు. ఆ యువకుడు అంటాడు. ఒక అమ్మాయికి ముద్దు పెడతా.. ఇంకో అమ్మాయితో డేటింగ్.. మిగిలిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. ఇదేనా యువతీ యువకులకు మీరు ఇచ్చే సందేశం ఇదేనా అని నారాయణ ప్రశ్నించారు.
అయితే ఇంతలా దిగజారిపోయే అనైతిక పద్దతులు పాటిస్తున్నారా..? అయినా వంద రోజుల పాటు వారిని బాహ్యప్రపంచానికి దూరంగా ఉంచడం అనేది దారుణం అని అన్నారు. ఇక వీటి ద్వారా విలాసవంతమైన అనైతిక చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. దీన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. కళామ్మతల్లికి అన్యాయం చేస్తున్నారు. దీని ద్వారా కళామ్మతల్లికి ప్రమాదం ఏర్పడింది. వీటివల్ల సమాజానికి ఉపయోగం లేదు. కోట్లాది మంది ప్రజల్ని మోసం చేస్తున్నారు. బిగ్ బాస్ షో ద్వారా సాంస్కృతిక దోపిడీ జరుగుతుంది. ఇలాంటి అనైతిక షోలను ప్రజలు బహిష్కరించాలని పిలుపునిస్తూ మండిపడ్డారు సీపీఐ నారాయణ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: