లో స్కోరింగ్ మ్యాచ్లో విజయం.. టీమిండియా అరుదైన రికార్డ్?

praveen
వరల్డ్ కప్ లాంటి పెద్ద టోర్నమెంట్లలో టైటిల్ రేసులో ఎప్పుడు ముందు ఉండాలంటే.. ప్రతి మ్యాచ్ కూడా ఎంతో కీలకమైనది అని చెప్పాలి. ఈ క్రమంలోనే టైటిల్ గెలవాలనే పట్టుదలతో ఉన్న అన్ని జట్లు కూడా అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ అదరగొడుతూ ఉంటాయి. అయితే ప్రస్తుతం ఎట్టి పరిస్థితుల్లో టైటిల్ గెలవాలనే పట్టుదలతో బరిలోకి దిగిన భారత జట్టు కూడా వరుస విజయాలు సాధిస్తూ దూసుకుపోతుంది అన్న విషయం తెలిసిందే. మొదటి మ్యాచ్ లో చిన్న టీం అయినా ఐర్లాండ్తో జరిగిన పోరులో ఘన విజయాన్ని అందుకున్న టీమిండియా.. ఇటీవల చిరకాల ప్రత్యర్థి  పాకిస్తాన్ తో జరిగిన పోరులో కూడా చివరికి విజయం సాధించి అదరగొట్టింది.

 ఈ క్రమంలోనే గ్రూప్ ఏ లో ప్రస్తుతం టీమిండియా టాప్ లో కొనసాగుతూ ఉంది అని చెప్పాలి. అయితే ఇటీవల ఇండియా, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతూ క్రికెట్ ప్రేక్షకులకు అసలు సిసలైన మజాను అందించింది అని చెప్పాలి. ఎందుకంటే ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా కేవలం 119 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో భారత జట్టు ఓటమి ఖాయమని ఎంతో మంది విశ్లేషకులు కూడా అంచనా వేశారు. కానీ లో స్కోరింగ్ గేమ్ లో కూడా టీమిండియా అద్భుతంగా రాణించింది. బౌలర్లు బుల్లెట్ లాంటి బంతులు విసిరి ఇక జట్టును విజయ తీరాలకు చేర్చారు.

 ఈ క్రమంలోనే టీ20 వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్తాన్ ను ఓడించిన భారత్ ఓ అరుదైన రికార్డు కూడా సాధించింది. వరల్డ్ కప్ లో అత్యల్ప టార్గెట్ ను డిఫెండ్ చేసుకున్న రెండో జట్టుగా నిలిచింది. అయితే 2014లో శ్రీలంక 120 స్కోర్ ను కాపాడుకొని న్యూజిలాండ్ జట్టుపై విజయం సాధించింది. ఇక ఇప్పుడు ఇలాంటి రికార్డు నే అటు భారత్ కూడా సృష్టించింది. ఓవరాల్ గా పొట్టి ఫార్మాట్లో భారత్ డిపెండ్  చేసుకున్న అత్యల్ప స్కోరు ఇదే కావడం విశేషం. గతంలో జింబాబ్వే పై 139 ఇంగ్లాండ్ ఫై 145 బంగ్లాదేశ్ పై 147 పరుగుల స్కోర్ ని డిపెండ్ చేసుకుంది భారత జట్టు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: