T20 WC లో.. పాకిస్తాన్ కథ ముగిసినట్లేనా?

praveen
ప్రస్తుతం ఎంతో ఉత్కంఠ భరితంగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో ప్రతి మ్యాచ్ కూడా క్రికెట్ ప్రేక్షకులకు అసలు సిసలైన ఎంటర్టైన్మెంట్ పంచుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలే వరల్డ్ క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ పైసా వసూల్ మ్యాచ్ గా నిలిచింది  ఎందుకంటే చివరి వరకు ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ అసలు సిసలైన క్రికెట్ మజాకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది అని చెప్పాలి. అయితే ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన టీమిండియా జట్టు లో స్కోరింగ్ లో కూడా ఘన విజయాన్ని అందుకుంది. ఇక ఎప్పటిలాగానే పాకిస్తాన్ పై ఫైచేయి సాధించింది.

 అయితే ఈ టి20 వరల్డ్ కప్ టోర్నీలో కొన్ని జట్ల ప్రదర్శన అత్యంత నిరాశ జనకంగా ఉంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన జట్లు చెత్త ప్రదర్శన చేస్తూ చివరికి టైటిల్ పోరులో అంతకంతకు వెనకబడిపోతున్నాయి అని చెప్పాలి. ఇక ఇలాంటి జట్లలో అటు పాకిస్తాన్ జట్టు ముందు వరుసలో ఉంది. వరల్డ్ కప్ మాజీ ఛాంపియన్గా కొనసాగుతున్న పాకిస్తాన్ ఈ వరల్డ్ కప్ లో కూడా అటు టైటిల్ ఫేవరెట్ గానే బరిలోకి దిగింది. ఈ క్రమంలోనే ఈ సారి అద్భుతంగా రాణించి  తప్పకుండా టైటిల్ రేసులో అన్ని జట్ల కంటే ముందు ఉంటుందని ఆ దేశ క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా భారీగానే ఆశలు పెట్టుకున్నారు.

 కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే ఈ టి20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ కథ దాదాపు ముగిసినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే ఇండియా చేతిలో ఓటమితో ఆ జట్టు సూపర్ 8 అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారిపోయాయి అని చెప్పాలి. అమెరికా గెలుపోవటములపై పాకిస్తాన్ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ప్రస్తుతం గ్రూప్ ఏ లో భారత్, యూఎస్ఏ జట్లు మొదటి రెండు స్థానాలలో ఉండగా నాలుగవ స్థానంలో పాకిస్తాన్ ఉంది. సూపర్ 8 చేరాలంటే ఐర్లాండ్, కెనడా జట్లపై పాకిస్తాన్ తప్పనిసరిగా గెలవాలి. అదే సమయంలో టాప్ 2 లో ఉన్న యూఎస్ఏ.. ఆ ర్యాంకు నుంచి పడిపోవాలి   లేదంటే పాకిస్తాన్  వరల్డ్ కప్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: