చంద్ర బాబు: ప్రమాణ స్వీకారానికి గ్లోబల్ స్టార్.. ఎవరంటే..?

Divya
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో టిడిపి, జనసేన, బిజెపి పార్టీ కూటమిగా మంచి విజయాన్ని సాధించింది అధికార పార్టీ వైసీపీని కేవలం 11 స్థానాలకే పరిమితం చేసిన కూటమి 164 స్థానాలలో భారీ విజయాన్ని అందుకుంది.. దీంతో త్వరలోనే ఏపీ సీఎం గా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈనెల 12 వ తేదీన ఉదయం 11:27 నిమిషాలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే గన్నవరం ఎయిర్ పోర్టులో దగ్గరలో ఉన్న కేసరపల్లి ఐటి పార్కులో దాదాపుగా 11 ఎకరాల స్థలంలో ఈ చంద్రబాబు స్వీకారం చేయబోతున్నారు.

చంద్రబాబుతో పాటు క్యాబినెట్ మంత్రులు కూడా ఈ ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఏపీలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించిన జనసేన ఎమ్మెల్యేలు కూడా ఇక్కడే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు తెలుస్తోంది.ఇదంతా ఇలా ఉంటే చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి చాలా మంది సెలబ్రిటీలు క్రీడా రాజకీయ పారిశ్రామిక రంగాలకు చెందిన ప్రముఖులు కూడా హాజరు అయ్యేలా ప్లాన్ చేశారు. తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి రామ్ చరణ్ ప్రమాణ స్వీకారానికి హాజరు కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ చేంజింగ్ అనే సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా రాజమండ్రి పరిసర ప్రాంతాలలోనే జరుగుతున్నది. దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఆంధ్రాలో షూటింగ్ జరుగుతోంది కనుక ఈ వేడుకకు సైతం రామ్ చరణ్ వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా మెగా బ్రదర్ కావడం చేత రామ్ చరణ్ కూడా తన బాబాయ్ కోసమే ఈ వేదికకు వెళ్ళబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఎవరెవరు వస్తారు అంటూ ఆత్రుతగా నేతలు కార్యకర్తలు సైతం ఎదురుచేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: