చరణ్ కవల పిల్లల కోసం బాలయ్య అద్దిరిపోయే గిఫ్ట్..ఇది పెద్దరికం అంటే..!

Thota Jaya Madhuri


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంట్లో కవల పిల్లల జననం సందర్భంగా ఇండస్ట్రీ మొత్తం ఆనందంలో మునిగిపోయింది. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని సినీ, రాజకీయ, వ్యాపార రంగాల ప్రముఖులు పలువురు రామ్ చరణ్ కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ ఇచ్చిన గిఫ్ట్ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.సాధారణంగా ఇలాంటి వేళల్లో ఖరీదైన గోల్డ్ గిఫ్ట్స్, విలువైన వస్తువులు అందించడం సాధారణమే. కానీ బాలయ్య మాత్రం ఆ సంప్రదాయానికి భిన్నంగా ఆలోచించి, నిజమైన పెద్దరికం అంటే ఏంటో మరోసారి నిరూపించారనే చెప్పాలి. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, బాలకృష్ణ రామ్ చరణ్‌కు ప్రత్యేకంగా అందమైన ఫ్లవర్ బొకే పంపడమే కాకుండా, వెంకటేశ్వర స్వామి వారి పటాన్ని కూడా ఆశీర్వాదంగా బహుమతిగా పంపారట.

ఈ వార్త బయటకు రావడంతో అభిమానులు ఆశ్చర్యంతో పాటు భావోద్వేగానికి గురవుతున్నారు. “గోల్డ్ గిఫ్ట్‌లు చాలా చిన్నవి… కానీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం జీవితాంతం తోడుంటుంది” అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. డబ్బుతో కొలవలేని విలువైన బహుమతిని బాలయ్య ఇచ్చారని, ఇది నిజంగా హృదయాన్ని తాకే గిఫ్ట్ అని కొనియాడుతున్నారు.ఈ విషయం తెలిసిన తర్వాత రామ్ చరణ్ అభిమానులు కూడా బాలయ్యపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మెగా కుటుంబం పట్ల నందమూరి బాలయ్యకు ఉన్న గౌరవం, ప్రేమ ఈ సంఘటనతో మరోసారి బయటపడిందని అంటున్నారు. వ్యక్తిగత విభేదాలు, ఫ్యాన్ వార్స్ అన్నింటికీ అతీతంగా, మనసుతో చేసిన ఈ గిఫ్ట్ నిజంగా గ్రేట్ అని కామెంట్లు చేస్తున్నారు.

ఇక మరోవైపు నందమూరి ఫ్యామిలీకి చెందిన జూనియర్ ఎన్టీఆర్ కూడా రామ్ చరణ్‌కు శుభాకాంక్షలు చెప్పడంలో ముందుండడం విశేషం. అందరికంటే ముందుగా సోషల్ మీడియా ద్వారా రామ్ చరణ్‌కు కంగ్రాట్స్ చెబుతూ, తన ఆనందాన్ని పంచుకున్నారు ఎన్టీఆర్. ఇది కూడా అభిమానుల్లో మరింత పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసింది.మొత్తానికి, రామ్ చరణ్ కవల పిల్లల జననం సందర్భంగా చోటు చేసుకున్న ఈ పరిణామాలు టాలీవుడ్‌లో అరుదైన ఐక్యతను చూపిస్తున్నాయి. ముఖ్యంగా బాలకృష్ణ ఇచ్చిన వెంకటేశ్వర స్వామి వారి పటం మాత్రం “పెద్దరికం అంటే ఇదే” అని మరోసారి నిరూపించిన ఘటనగా అభిమానుల గుండెల్లో నిలిచిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: