మెగా 158తో ఆ రికార్డు కొట్టేయనున్న ప్రియమణి..?

Pulgam Srinivas
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి కొంత కాలం క్రితం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి బాబీ దర్శకత్వంలో రూపొందిన వాల్తేరు వీరయ్య అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమా 2023 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యి బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే వాల్తేరు వీరయ్య సినిమా తర్వాత చిరంజీవి , బాబి కాంబో లో మరో మూవీ రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ సినిమాకు ఇప్పటివరకు టైటిల్ను ఫిక్స్ చేయలేదు.


దానితో ఈ మూవీ చిరంజీవి కెరియర్లో 158 వ మూవీగా రానుండడంతో ఈ మూవీ ని మెగా 158 అనే వర్కింగ్ టైటిల్ తో అధికారిక ప్రకటన విడుదల చేశారు. తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటి మణులలో ఒకరు అయినటువంటి ప్రియమణి హీరోయిన్గా నటించబోతున్నట్లు , ప్రియమణి పాత్ర ఈ సినిమాలో సూపర్ గా ఉండబోతున్నట్లు , దానితో ఈ మూవీ లో నటించడానికి ఈమె ఇప్పటివరకు ఏ సినిమా కోసం  అందుకొని పారితోషకాన్ని ఈ మూవీ కోసం పుచ్చుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ప్రస్తుతం ప్రియమైన కెరియర్ పర్వాలేదు అనే స్థాయిలో నడుస్తుంది. ఒక వేళ మెగా 158 మూవీలో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్గా నటించి , ఆ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని , అందులో ప్రియమణి పాత్ర కూడా సూపర్ గా ఉన్నట్లయితే ఈమె కెరియర్ గ్రాఫ్ మళ్లీ ఒక్క సారిగా పైకి లేచి అవకాశం ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. ఇక ఈ మూవీ లో మోహన్ లాల్ కూడా ఓ కీలకమైన పాత్రలో నటించే అవకాశాలు ఉన్నాయి అని ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: