కల్కి ట్రైలర్ : మీకు కమల్ పాత్ర కనిపించిందా?

praveen
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో డార్లింగ్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న మూవీ కల్కి ఏడి 2898. ఈ మూవీపై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రభాస్ కెరియర్ లో ఇప్పటివరకు ఎన్నో రకాల పాత్రలు చేశాడు  కానీ మునుపేన్నడు చూడని విధంగా కొత్త పాత్రలో నాగ్ అశ్విన్ డార్లింగ్ ని చూపించబోతున్నాడు అన్న విషయం ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ ల ద్వారా అర్థమైంది. సైన్స్ ఫిక్షన్,  ఫ్యూచరిస్టిక్ అనే కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ అందరిని అబ్బురపరచబోతుందని ఇప్పటికే ప్రేక్షకులు ఫిక్స్ అయ్యారు.

 ఇప్పటికే విడుదల వాయిదా పడుతూ వచ్చిన ఈ భారీ బడ్జెట్ మూవీ.. ఈనెల 27వ తేదీన థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. అయితే ఇక ఇటీవల ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. అయితే ట్రైలర్ గురించి చెప్పడానికి మాటలు సరిపోవట్లేదు. ఎందుకంటే ఊహకందని రీతిలో కలలో కూడా ఊహించని ఎలివేషన్స్ తో ఈ ట్రైలర్ ఉంది. హాలీవుడ్ సినిమాలను తలదన్నే రేంజ్ లో యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతున్నాయి అన్నది ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.. ట్రైలరే ఇలా ఉందంటే మూవీ ఎలా ఉంటుందో అని ఊహించుకోవడానికి కూడా ఆలోచనలు రానంత గొప్పగా కల్కి ట్రైలర్ ఉంది అని చెప్పాలి. అయితే ఈ మూవీలో ప్రభాస్ తో పాటు దీపిక పదుకొనే, దిశా పఠాని  లాంటి హీరోయిన్లతో పాటు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్, లోకనాయకుడు కమల్ హాసన్ కూడా కీలకపాత్రలో నటిస్తున్నారు.

 ఇక ట్రైలర్లో ఇలా కీలక పాత్రలో నటిస్తున్న స్టార్స్ అందరి పాత్రలు కనిపించాయి. ఈ క్రమంలోనే కమల్ పాత్ర ఎలా ఉంటుందో అని చూడాలని అభిమానులు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ట్రైలర్ చూశారు. కానీ ట్రైలర్ చూస్తున్నంత సేపు కమల్ పాత్ర ఎక్కడ కనిపించలేదు. ఇంకేముంది ఏదో ట్విస్ట్ పెట్టారు. అందుకే కమల్ పాత్రను చూపించలేదు అని ట్రైలర్ ముగిస్తున్న సమయంలో అనుకుంటుండగా.. అంతలో ఒక విభిన్నమైన పాత్ర కనిపిస్తుంది  ఆ పాత్ర డైలాగ్ చెప్పే వెర్షన్ కూడా కమల్ లాగే ఉంటుంది. దీంతో ఇదే కమల్ పాత్ర అని అందరూ ఫిక్స్ అయిపోతున్నారు. ఇదేంటి బాసు నాగ్ అశ్విన్ కమలహాసన్ పాత్రను ఇంత క్రేజీగా ప్లాన్ చేశాడు అని కామెంట్లు చేస్తున్నారు ఎంతోమంది నేటిజన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: