టీవీ: బీడీలు తాగుతూ రచ్చ చేస్తున్న జబర్దస్త్ బ్యూటీ..!

Divya
బిగ్ బాస్ తెలుగు -7 లో మంచి పాపులారిటీ సంపాదించిన వారిలో రతీకా రోజ్ కూడా ఒకరు.. బిగ్ బాస్ హౌస్లో చేసిన రచ్చ గురించి చెప్పాల్సిన పనిలేదు ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్లో రతీకా ప్రవర్తన వివాదాస్పదకరంగా మారింది. అవసరానికి తగ్గట్టుగా ఆమె తమ అభిప్రాయాలను సైతం మారుస్తూ ఉండేది. దీంతో హౌస్ లో ఒక్కసారిగా నెగిటివిటీ మూట కట్టుకోవడంతో నాలుగు వారాలకే హౌస్ నుంచి బయటికి వచ్చేసింది రతీకా రోజ్. హౌస్ లోకి రెండో ఛాన్స్ వచ్చినప్పటికీ.. గేమ్లో కన్ఫ్యూజన్ అయి సత్తా చాట లేకపోయింది.

12వ వారం ఎలిమినేట్ కావడం జరిగింది. దీంతో బిగ్ బాస్ వల్ల వచ్చిన క్రేజ్ తో నటిగా కూడా ఆఫర్స్ ని అందుకుంది రతీకా రోజ్.. బుల్లితెర పైన పలు సీరియల్స్ లో కూడా సందడి చేయడమే కాకుండా షోలలో కూడా కనిపిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో నిత్యం ఆక్టివ్ గా ఉండే రతీకా రోజ్ తాజాగా ఒక వీడియోని షేర్ చేయడం జరిగింది.. ఈ వీడియోలో పొలాలలో దమ్ము కొడుతూ మాస్ గా కనిపిస్తోంది అలాగే లంగా వోనిలో పల్లెటూరు అమ్మాయిగా సైకిల్ పైకి వెళుతూ బిడి తాగుతోంది ఈ ముద్దుగుమ్మ.

అయితే ఇదంతా ఒక రియల్ కోసం చేసినట్లుగా కనిపిస్తోంది. ముఖ్యంగా అల్లు అర్జున్ రష్మిక నటించిన పుష్ప-2 సినిమాలోని సూసేకి అనే పాటకి రీల్స్ చేసినట్టుగా కనిపిస్తోంది. రతీకా రోజ్ తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈ రీల్ కాస్త వైరల్ గా మారడంతో ఫాన్సీ సైతం పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా బీడీ తాగుతూ పొలాలలో రచ్చ రేపుతోంది రతీకా రోజ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వీడియోలతో మంచి పాపులారిటీ సంపాదించుకుంటున్న ఈ ముద్దుగుమ్మకు సినిమాలలో మరిన్ని అవకాశాలు వస్తాయేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: