ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా ఐదు తెలుగు సినిమాలు విడుదల అయ్యాయి. మొదటగా జనవరి 9 వ తేదీన ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో రూపొందిన ది రాజా సాబ్ మూవీ విడుదల కాగా , ఆ తర్వాత జనవరి 12 వ తేదీన చిరంజీవి హీరో గా అనిల్ రావిపూడి దర్శకత్వం లో రూపొందిన మన శంకర వర ప్రసాద్ గారు సినిమా విడుదల అయింది. ఆ తర్వాత జనవరి 13 వ తేదీన రవితేజ హీరో గా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా విడుదల కాగా , జనవరి 14 వ తేదీన నవీన్ పోలిశెట్టి హీరో గా రూపొందిన అనగనగా ఒక రాజు , అదే తేదీన శర్వానంద్ హీరో గా రూపొందిన నారీ నారీ నడుమ మురారి సినిమాలు విడుదల అయ్యాయి. ఇలా ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయిన ఈ ఐదు సినిమాలలో రాజా సాబ్ మూవీ ని మినహాయిస్తే మిగతా నాలుగు సినిమాలకు కూడా మంచి టాక్ వచ్చింది. ఇకపోతే ఆఖరి 24 గంటల్లో ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయిన ఈ ఐదు తెలుగు సినిమాలకు బుక్ మై షో లో ఎన్ని టికెట్లు సేల్ అయ్యాయి అనే వివరాలను క్లియర్ గా తెలుసుకుందాం.
ఆఖరి 24 గంటల్లో మన శంకర వర ప్రసాద్ గారు మూవీ కి సంబంధించిన 303.54 కే టికెట్లు బుక్ మై షో ఆప్ లో సేల్ అయ్యాయి.
ఆఖరి 24 గంటల్లో అనగనగా ఒక రాజు మూవీ కి సంబంధించిన 147.58 కే టికెట్లు బుక్ మై షో ఆప్ లో సేల్ అయ్యాయి.
ఆఖరి 24 గంటల్లో మన నారీ నారీ నడుమ మురారి మూవీ కి సంబంధించిన 65.75 కే టికెట్లు బుక్ మై షో ఆప్ లో సేల్ అయ్యాయి.
ఆఖరి 24 గంటల్లో ది రాజా సాబ్ మూవీ కి సంబంధించిన 39.86 కే టికెట్లు బుక్ మై షో ఆప్ లో సేల్ అయ్యాయి.
ఆఖరి 24 గంటల్లో భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ కి సంబంధించిన 30.26 కే టికెట్లు బుక్ మై షో ఆప్ లో సేల్ అయ్యాయి.