శ్రీ లీల అన్ని మూవీలను రిజెక్ట్ చేసిందా.. చేసుంటే కెరియర్ వేరేలా ఉండేదా..?
కొంత కాలం క్రితం శిరీష్ హీరోగా రౌడీ బాయ్స్ అనే మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది. ఈ మూవీ లో మొదటగా అనుపమ పరమేశ్వరన్ ను కాకుండా శ్రీ లీల ను హీరోయిన్గా అనుకున్నారట. ఇక ఈ ముద్దుగుమ్మను ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం సంప్రదించగా ఆ సమయంలో ఈమె అనేక సినిమాలతో బిజీగా ఉండడంతో ఈ సినిమా చేయలేను అని చెప్పిందట. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు. తాజాగా నవీన్ పోలిశెట్టి హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్గా రూపొందిన అనగనగా ఒక రాజు అనే సినిమా విడుదల అయిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో మొదటి శ్రీ లీల ను హీరోయిన్గా అనుకున్నారు. అలాగే ఈ మూవీలో శ్రీ లీల హీరోయిన్గా నటిస్తున్నట్లు ఈ మూవీ బృందం వారు అధికారిక ప్రకటనను కూడా విడుదల చేశారు. కానీ ఆ తర్వాత ఈ మూవీ నుండి శ్రీ లీల తప్పుకుంది. ఈ సినిమా తాజాగా జనవరి 14 వ తేదీన విడుదల అయ్యి అద్భుతమైన టాక్ ను తెచ్చుకొని అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను వసూలు చేస్తూ బ్లాక్ బాస్టర్ వైపు పయనిస్తుంది. ఇలా ఇప్పటివరకు శ్రీ లీల తన కెరియర్లో రెండు సినిమాలను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది.