వామ్మో: ఏకంగా రూ. 1800 కోట్లు పోగొట్టుకున్న నటుడు శివాజీ..!

Divya
టాలీవుడ్ లో ఒకప్పుడు హీరోగా పలు చిత్రాలలో నటించిన శివాజీ ఈమధ్య క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి పలు సినిమాలలో నటిస్తున్నారు. ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి వచ్చిన తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలుపెట్టి పలు చిత్రాలతో అలరిస్తున్నారు. ఇటీవల శివాజీ , అలనాటి హీరోయిన్ లయ ప్రధాన పాత్రలో నటించిన సాంప్రదాయని సుప్పినీ శుద్ధపూసనీ సినిమా మార్చి 6న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శివాజీ పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు.


తాను సినిమాలను నిలిపివేసిన తర్వాత రొటేషన్ కోసం కొన్ని స్థలాలు కొనడం అమ్మడం వంటివి చేశానని, అలా యాదగిరి గుట్ట వద్ద రూ.70 వేల రూపాయలు చొప్పున ఎకరంతో కొన్నప్పటికీ, తాను ఒక్కో ఎకరాన్ని రూ .9 లక్షల రూపాయల వరకు అమ్మనని, కానీ అలా అమ్మిన తర్వాత ఆ స్థలం భారీగా ధర పెరిగిపోయిందని తెలిపారు. ప్రస్తుత ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉన్న ప్రదేశంలో 18 ఎకరాలు కొన్నానని దానిని కూడా తక్కువ లాభానికి అమ్మేశానని, అదంతా కూడా రొటేషన్ కోసమే చేశాను అంటూ తెలిపారు.


కానీ ఇప్పుడు తాను అమ్మిన స్థలాలను బట్టి చూస్తే ఒక్కో ఎకరం రూ .100 కోట్ల రూపాయల వరకు పలికేదని.. అంటే దాదాపుగా రూ.1800 కోట్ల రూపాయలు నష్టపోయా అంటూ పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు.. భూమి ధరలు ఇంతగా పెరుగుతాయని ఆలోచన తనకు రాలేకపోయిందని తెలియజేశారు. ప్రస్తుతం శివాజీ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గతంలో పొలిటికల్ పరంగా యాక్టివ్ గా ఉన్నప్పటికీ ఈమధ్య కాలంలో శివాజీ రాజకీయాల గురించి పెద్దగా పట్టించుకోలేదని విధంగా కనిపిస్తోంది. కేవలం సినిమాల పైన ఫోకస్ పెట్టి సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. మరి రాబోయే రోజులలో పెద్దపెద్ద సినిమాలలో నటిస్తారేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: