300 కోట్ల దిశగా పరుగులు పెడుతున్న "మన శంకర వరప్రసాద్ గారు".!

Pandrala Sravanthi
మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా ఆరు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్స్ సాధించడమే కాకుండా త్వరలోనే 300 కోట్ల క్లబ్ లో చేరే దిశగా పరుగులు పెడుతోంది. మరి ఇంతకీ మన శంకర వరప్రసాద్ గారు సినిమా ఆరు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.. 300 కోట్ల కలెక్షన్స్ కి ఇంకా ఎంత దూరంలో ఉంది అనేది ఇప్పుడు చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ కూడా లేని డైరెక్టర్ల లిస్టులో అనిల్ రావిపూడి పేరు కూడా ఉంటుంది.అలాంటి ఈ డైరెక్టర్ దర్శకత్వంలో వచ్చిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా మొదటి రోజే బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోయింది.


ఇక మొదటి రోజు టాక్ బాగుండడంతో సంక్రాంతికి చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా చూడడానికి ఇష్టపడ్డారు. ముఖ్యంగా వెంకటేష్ క్యామియో రోల్ తో పాటు చిరంజీవి కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉండడంతో పాటు నయనతార యాక్టింగ్ కూడా బాగుండడంతో సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. అనిల్ రావిపూడి తన మార్క్ డైరెక్షన్ తో మరోసారి హిట్ కొట్టేశారు.అలాగే ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన భీమ్స్ సిసిరోలియో మరోసారి మ్యాజిక్ చేశారు. అలా టోటల్ గా సినిమాకి అన్ని కలిసి రావడంతో మన శంకర వరప్రసాద్ గారు మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక ఈ సినిమా మొదటి రోజే 84 కోట్ల కలెక్షన్స్ సాధించగా..రెండు రోజులకే 120 కోట్లు సాధించింది.


అయితే తాజాగా ఈ సినిమా విడుదలై ఆరు రోజులు అయిన సందర్భంగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 261 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు చిత్ర యూనిట్ ఆఫీషియల్ గా ప్రకటించింది.ఇక ఈ స్పీడ్ చూస్తూ ఉంటే మరో నాలుగు రోజుల్లోనే సినిమా 300 కోట్ల క్లబ్లో చేరేలా ఉంది. అలా సినిమా విడుదలైన 10 రోజుల్లోనే 300 కోట్ల క్లబ్లో చేరబోతున్నట్టు మెగా ఫ్యాన్స్ అంచనాలు వేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ సినిమా ద్వారా వింటేజ్ చిరంజీవి ఈజ్ బ్యాక్ అనే పేరు తెచ్చుకోవడమే కాకుండా 300 కోట్ల క్లబ్లో చేరే సీనియర్ హీరోగా కూడా ఈయన పేరు ఇండస్ట్రీలో మార్మోగిపోతుంది.ఇక చిరంజీవి నుండి నెక్స్ట్ వచ్చే సినిమాల విషయానికి వస్తే..ఇప్పుడు వచ్చే సమ్మర్లో మరోసారి విశ్వంభర మూవీ తో మన ముందుకు రాబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: