ముద్రగడకు మరో షాక్.. మా కులంలోకి రావొద్దంటూ..?

Divya
కాపు ఉద్యమ నేత వైసిపి పార్టీ లీడర్ ముద్రగడ పద్మనాభం పేరు గత కొద్ది రోజుల నుంచి ఎక్కువగా వినిపిస్తోంది. అదేమిటంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎలాగైనా ఓడిస్తానంటూ తెలియజేశారు. ఒకవేళ అలా ఓడించకుంటే తాను ముద్రగడ పద్మనాభ రెడ్డి గా పేరు మార్చుకుంటాను అంటూ తెలియజేశారు. కూటమిలో భాగంగా జనసేన పార్టీ 21 స్థానాలకు 21 స్థానాలు గెలిచింది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ కూడా గెలవడంతో తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డి గా మార్చుకునేందుకు అన్ని సిద్ధం చేసుకున్నానని త్వరలోనే మార్చుకున్న తర్వాత ఆ పత్రాలను కూడా మీకు అందిస్తానంటూ తెలియజేశారు.

అయితే ఇప్పుడు తాజాగా ఈ విషయం పైన కూడా ముద్రగడ పద్మనాభంకు షాక్ తగినట్లుగా తెలుస్తోంది. తాజాగా అనపర్తి మండలం కొప్పవరం మాజీ సర్పంచ్ కర్రీ వెంకటరామిరెడ్డి ముద్రగడ పైన స్పందిస్తూ ఒక లేఖ రాశారు.. అదేమిటంటే మీరు రెడ్డి కులంలో చేరటానికి మారెడ్లు ఎవరైనా అనుమతి ఇచ్చారా?.. మా రెడ్డి కులంలో ఎందుకు చేరాలనుకుంటున్నారు.. మా వాళ్ల పరువు తీయడానికి చేయాలనుకుంటున్నారా అంటూ పైరయ్యారు. అలాగే ఆంధ్ర రెడ్డి సంఘం నుంచి ఒక విజ్ఞప్తి చేశారు వెంకటరామిరెడ్డి..

ముద్రగడ పద్మనాభం రెడ్లలో చేరుతామంటూ  ప్రకటించిన నాలుగు రోజులు అయినా ఎవరు ఎందుకు స్పందించలేదు అని నిలదీశారని.. నైతిక విలువలు లేకుండా మాట్లాడే వ్యక్తులను రెడ్లలో చేరాలనుకుంటే వారిని చేర్చుకోవాల్సిన అవసరం లేదు అంటూ మండిపడ్డారు.. ఇటువంటి వ్యక్తులు రెడ్లకు దూరంగా ఊహించవలసిన అవసరం సంఘానికి ఉంది అంటూ కూడా తెలియజేశారు. ఇటువంటి వ్యక్తులను మా రెడ్లలో చేర్చుకోవడం లేదని ప్రకటించాలంటూ కోరారు.. ముద్రగడ రెడ్లలో చేరడానికి ఒక గ్రామం మాజీ సర్పంచ్ రెడ్డిగా తాను వ్యతిరేకిస్తున్నట్లుగా ఇందులో తెలియజేశారు కర్రీ వెంకటరామిరెడ్డి. తాను చేసిన సవాల్ కి కట్టుబడి ఉంటానని ముద్రగడ తెలియజేశారు. అందుకే తన పేరును పద్మనాభ రెడ్డి గా మార్చుకొనీ తీరుతానంటూ కూడా తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: