ప్రభాస్, మహేష్.. అల్లు అర్జున్ ప్రకారం బెస్ట్ హీరో ఎవరంటే?
అయితే ఇక ఇప్పుడు పుష్ప సినిమాకు సీక్వల్ గా తెరకెక్కిన పార్ట్ 2 తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు అల్లు అర్జున్. డిసెంబర్ 5వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలకు కూడా చిత్ర యూనిట్ సిద్ధమవుతుంది. కాగా ఇప్పటికే అటు అల్లు అర్జున్ కూడా ప్రమోషన్స్ స్టార్ట్ చేశాడు. ఈ క్రమంలోనే ఇటీవల బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమానికి ఎంట్రీ ఇచ్చాడు అల్లు అర్జున్. ఈ క్రమంలోనే బాలకృష్ణ అడిగిన ఎన్నో ఆసక్తికర ప్రశ్నలకు అంతే ఆసక్తికర సమాధానాలు చెప్పాడు బన్నీ.
రొమాన్స్ ఇష్టమా యాక్షన్ ఇష్టమా అనే ప్రశ్నించగా.. తొక్కలో యాక్షన్ రొమాన్స్ అంటే ఇష్టం అంటూ అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు. హీరోయిన్లు ఎవరు ఇష్టం అంటూ అడిగితే.. హీరోల గురించి అడుగుతారేమో అని భయపడ్డా అంటూ అల్లు అర్జున్ సరదాగా స్పందించారు. పూజ హెగ్డే తో నటించడం ఇష్టమా రష్మికతో నటించడం ఇష్టమా అంటూ అడిగితే రష్మికనే ఇష్టం అంటూ తేల్చేశారు. అదే సమయంలో మహేష్ బాబు ప్రభాస్ వీరిద్దరిలో నీకు ఎవరు పోటీ అని భావిస్తారు అంటూ బాలకృష్ణ ప్రశ్నించారు. దీనికి అల్లు అర్జున్ ఎంతో ఆచితూచి సమాధానం చెప్పారు.
నన్ను మించి ఎదిగినోడు ఇంకోడు ఉన్నాడు చూడు అంటే.. అది రేపటి నేనే అంటూ సమాధానమిచ్చాడు. అంటే తనకు ఎవరూ పోటీలేరు అన్న విషయాన్ని ఇన్ డైరెక్ట్ గా చెప్పేసాడు. మహేష్ బాబు అంటే అందరూ ఆయన అందం గురించి మాట్లాడుతారు. కానీ నాకు పర్సనల్ గా నచ్చే విషయం ఏంటంటే.. ఆయన కంబాక్స్ చాలా బాగుంటాయి. ఫెయిల్యూర్ తర్వాత ఆయన కం బ్యాక్ ఇచ్చే విధానం అదిరిపోతుంది. ఆయన ట్రూ సినిమా లవర్. ఆయన మీద నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. ఇక ప్రభాస్ ఆరడుగుల బంగారం. అంతే అంటూ అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ గురించి కూడా మాట్లాడారు. ఎవరు ఏమనుకున్నా ఆయన అనుకున్నది చేసేస్తారు. ఆయన ముక్కుసూటి తత్వం అంటే ఎంతో ఇష్టం అంటూ అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు.