బాలయ్య: మంచి మనసు.. సలాం కొట్టాల్సిందే..!

Divya
ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 175 స్థానాలలో 164 స్థానాలు గెలిచి ఏకపక్ష విజయాన్ని సంపాదించుకుంది కూటమి.. గతంలో టిడిపి ప్రవేశపెట్టిన పలు కార్యక్రమాలను సైతం వైసీపీ పార్టీ చాలానే తీసివేసింది. అందులో అన్న క్యాంటీన్ కూడా ఒకటి. దీంతో చంద్రబాబు ఈసారి అధికారంలోకి వస్తే తిరిగి వాటిని కంటిన్యూ చేస్తానంటూ ఎన్నికల ముందు తెలియజేశారు. ఇప్పుడు ఆ దిశగానే అడుగులు వేస్తూ ముందుకు వెళుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పేదలకు అన్నం పెట్టే ఉద్దేశంతో అప్పట్లో టిడిపి ప్రభుత్వం కేవలం ఐదు రూపాయలకే నాణ్యమైన భోజనాన్ని అందించింది.

ఐదేళ్లపాటు ఈ కార్యక్రమాన్ని కొనసాగించినప్పటికి.. వైసీపీ అధికారంలోకి రాగానే ఈ కార్యక్రమాన్ని వదిలేశారు. ఇప్పుడు మళ్లీ టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో అన్న క్యాంటీన్లు తెరుచుకునేలా చేస్తున్నారు. ఈ విషయంలో అందరికంటే ముందుగా ఉన్నారు నందమూరి ఎమ్మెల్యే హీరో బాలకృష్ణ. నిన్నటి రోజున తన పుట్టినరోజు సందర్భంగా టిడిపి పార్టీ ఏర్పడినందుకు తన నియోజకవర్గ పరిధిలో మొట్టమొదటిగా అన్న క్యాంటీన్ సైతం మొదలుపెట్టారు. హిందూపురం నియోజకవర్గం నుంచి బాలకృష్ణ మూడుసార్లు ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు. దీంతో నియోజవర్గ ప్రజలకు చాలా రుణపడి ఉండాలని తెలియజేస్తూ అన్న క్యాంటీన్ సైతం మొదలుపెట్టారు బాలయ్య.

బాలయ్య చేసిన పనికి చాలామంది సెలబ్రిటీలు నేతలు కార్యకర్తలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.. బాలకృష్ణ తన పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి మంచి పని చేసి ఎందరికో మేలు చేశారని కూడా తెలియజేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో అన్ని ప్రాంతాలలో కూడా అన్న క్యాంటీన్లు ఓపెన్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం ఈనెల 12వ తేదీన పూర్తి చేసిన వెంటనే అన్ని పనులను కూడా క్రమక్రమంగా చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఐదు రూపాయలకే భోజనం వల్ల చాలామంది పేద ప్రజలు కడుపునిండా అన్నం తింటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: