ఏపీ : ఆ రోజు కోసం ఆశగా నిరుద్యోగులు..?

FARMANULLA SHAIK
టీడీపీ అధినేత, కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రచారంలో చెప్పిన హమిలలో భాగంగా రాష్ట్రం లో నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలిస్తామని, ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపడితే డీఎస్సీపై తొలి సంతకం చేస్తానని స్పష్టం చేశారు. అధికారం లోకి వచ్చాక ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ చంద్రబాబు తన ప్రమాణ స్వీకారం రోజు తొలి సంతకం మెగా డీఎస్సీపై పెడతారని నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఈ నెల 12న గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రం లో ఖాళీ పోస్టుల వివరాలు పంపాలని ఇప్పటికే సంబంధిత అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ఈ నేపథ్యం లో విద్యా శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాల వారీగా ఖాళీల వివరాలను సేకరిస్తున్నారు. అంతేకాకుండా ఎన్నికల ప్రచారం లో ఉన్న సమయంలో బాబును కలిసిన ఓ యువతి పెన్నును బహుమతిగా ఇచ్చింది. ఆ పెన్నుతోనే సీఎం అయ్యాక మెగా డీఎస్సీపై సంతకం చేయాలని కోరింది. దీంతో ఆ పెన్నును చంద్రబాబు జాగ్రత్త గా పెట్టుకున్నారు. ప్రమాణస్వీకారం రోజే అదే పెన్ను తో సంతకం చేస్తారనే ఆశ లో నిరుద్యోగులు ఉన్నారు.గత ప్రభుత్వం 6,100 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన ఈ నోటిఫికేషన్ను రద్దు చేసి దాని స్థానం లో కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు విద్యా శాఖ కసరత్తు ప్రారంభించింది.దానికి సంబంధించిన ఏర్పాట్లు సత్వరమే పూర్తి చేయాలని విద్యాశాఖకు ఆదేశాలు అందించారు.దాంతో అధికారులు ఆ దిశగా ఖాళీలు సేకరిస్తున్నారు.ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు 2022-23లో 39,008 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా అప్పుడే కేంద్ర ప్రభుత్వం చెప్పింది అయితే ఏపీలో కూటమి గెలుపుతో యువత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: