ఐపీఎల్ లో “ధోనీ” సేన “బోణీ”

Bhavannarayana Nch

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసినా ఐపీఎల్ -11 వచ్చేసింది మొదట రోజు ఆట చెన్నై సూపర్ కింగ్స్  ముంబై ఇండియన్స్ మధ్య జరిగింది..మొదట టాస్  ఓడి బ్యాటింగ్ తీసుకున్న ముంబై ఇండియన్స్‌ పోటా పోటీగా ఆడుతూ నిర్ణీత ఓవర్స్ లో నాలుగు వికెట్ల నష్టానికి గాను 165 పరుగులు చేసింది..అయితే ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 165 పరుగల లక్ష్యాన్ని చెందించడానికి  చెన్నై సూపర్ కింగ్స్ తమ శక్తిని అంతా పళంగా పెట్టింది..

 

దాదాపు రెండేళ్ళ సుదీర్గమైన విరామం తరువాత ఐపీఎల్ పోరులో  చెన్నై సూపర్ కింగ్స్ తన సత్తా చాటింది... రెండేళ్ళ విరామం ఎంట్రీ ఇచ్చిన ధోనీ సేన  తమలో రెండేళ్ళ నుంచీ దాచుకున్న కసిని చూపించారు..రెండేళ్ల నిషేదం తర్వాత మళ్ళీ ఎంట్రీ ఇచ్చిన చెన్నై కింగ్స్ మొదటి రోజున మొదటి బోణీ తన ఖాతా లో వేసుకున్నారు..ముంబై ఇండియన్స్‌తో ఉత్కంఠగా జరిగిన  మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

 

టాస్‌ గెలిచి చెన్నై ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. అనంతరం 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ను టాప్‌ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ నిరాశపరిచాడు.అంబటి రాయుడు 22.. మినహా, వాట్సన్ 16,  రైనా4  జడేజా12 లు తీవ్రంగా నిరాశపరిచారు. చివర్లో జాదవ్‌, బ్రావో68(30)లు చెలరేగడంతో చెన్నై విజయం సాధించింది. చివర్లో బ్రావో అవుట్‌ కావడంతో మ్యాచ్‌ ఉంత్కఠంగా  మారింది.చివరికి చెన్నై జట్టు విజయం సాదించింది...

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: