బాయ్‌ఫ్రెండ్‌తో తిరుగుతున్న నటాషా వీడియో వైరల్ ?
విడాకులు తీసుకున్నప్పటికీ తమ కుమారుడు అగస్త్యకు కో-పేరెంట్స్ గా ఉంటామని వెల్లడించారు. ఆ తర్వాత నటాషా తన కుమారుడిని తీసుకొని సెర్బియాకు వెళ్ళింది. రెండు నెల క్రితం సెర్బియాకు వెళ్లిన నటాషా రెండు రోజుల క్రితమే మళ్ళీ ముంబైకి తిరిగి వచ్చింది. హార్దిక్ కారణంగానే ఈ జంట విడిపోయినట్టు టాక్ వినిపిస్తోంది. హార్దిక్ తన భార్య, కుమారుడిని పట్టించుకోకుండా తనకు నచ్చినట్టు లైఫ్ ఎంజాయ్ చేయడం, విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి కుటుంబాన్ని పట్టించుకోకపోవడం చేశాడట.
అయినప్పటికి నటాషా ఎంతో ఓపికగా భరించిందట. ఇక తన వల్ల కాకపోవడంతో విడాకులు తీసుకోవాలని ఫిక్స్ అయింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం నటాషా తన బాయ్ ఫ్రెండ్ అలెక్సాండర్ ఇరాక్ తో కలిసి ముంబై నగరంలో చక్కర్లు కొట్టారు. వీరిద్దరూ కలిసి ముంబై వీధుల్లో తిరిగిన సమయంలో కెమెరా కంటపడ్డారు. ప్రస్తుతం వారికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వీరిద్దరూ ఇలా తిరగడం చూసిన నెటిజెన్లు వీరు వివాహం చేసుకుంటారేమోనని కామెంట్లు చేస్తున్నారు. అయితే నటాషా తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఇదివరకే జిమ్ వుంది వద్ద కనిపించింది. వీరి విషయం తెలిసిన తర్వాతే హార్దిక్ పాండ్యా విడాకులు తీసుకున్నాడేమోనని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఇక ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.