హార్థిక్ పాండ్యాకు.. మరో బిగ్ షాక్ తగలబోతుందా?

frame హార్థిక్ పాండ్యాకు.. మరో బిగ్ షాక్ తగలబోతుందా?

praveen
టీమిండియాలో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న హార్దిక్ పాండ్యా.. గత కొంతకాలం నుంచి ఏదో ఒక విషయంతో వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఈ ఏడాది జరిగిన ఐపిఎల్ సీజన్ కి ముందు ఏకంగా ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్సీ చేపట్టాడు హార్దిక్. దీంతో రోహిత్ లాంటి కెప్టెన్ ను అటు హార్దిక్ పాండ్యా కారణంగానే తొలగించారు అంటూ ఆ జట్టు అభిమానులు సైతం ఈ స్టార్ ఆల్ రౌండర్ ని తెగ ట్రోలింగ్ చేశారు.

 దానికి తోడు అతను కెప్టెన్ గా మాత్రమే కాకుండా ఆటగాడిగా కూడా విఫలమవడంతో.. అతనిపై వచ్చిన విమర్శలు రెట్టింపు అయ్యాయి అని చెప్పాలి  అయితే ఆ తర్వాత జరిగిన వరల్డ్ కప్ టోర్నీలో మాత్రం అదరగొట్టిన హార్థిక్ పాండ్యా.. ఇక మళ్ళీ ప్రశంసలు అందుకున్నాడు. అటువెంటినే భార్య నటాషా తో విడాకులు తీసుకుని మరోసారి వార్తల్లో నిలిచాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మరోసారి వార్తల్లోకి ఎక్కాడు ఈ స్టార్ ఆల్ రౌండర్. గత ఏడాది హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ అప్పగించిన ముంబై ఇండియన్స్ యాజమాన్యం.. ఈసారి మాత్రం యూ టర్న్ తీసుకోబోతుంది అన్నది తెలుస్తుంది. ఎందుకంటే హార్దిక్ ను కెప్టెన్సీ నుంచి తప్పించడమే కాదు ఇక అతన్ని జట్టు నుంచి వేలంలోకి వదిలేయాలని అనుకుంటుందట.

 2025 ఐపీఎల్ మెగా వేళానికి ముందు ఈ స్టార్ ఆల్ రౌండర్ను వదులుకోవాలని ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ   నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సీజన్లో అతను కెప్టెన్సీలో మాత్రమే కాదు అటు ప్లేయర్గా కూడా విఫలమయ్యాడు. మరి ముఖ్యంగా హార్దిక్ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ లీగ్ స్టేజ్ కూడా దాటలేకపోయింది. ప్లేయర్గా కెప్టెన్ గా కూడా అతను విఫలం కావడంతో ఇక అతన్ని రిటైన్ చేసుకోకూడదు అని ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం నిర్ణయించుకుందట. అయితే ఇటీవల టీం ఇండియా టీ20 కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన సూర్య కుమార్ యాదవ్ను ముంబై ఇండియన్స్ యాజమాన్యం కెప్టెన్ గా నియమించుకునేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటుంది అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: