ధోని కి ఆ ఛాన్స్ ఎందుకు ఇచ్చానా అని.. ఇప్పటికీ బాధపడతా : గంభీర్

praveen
టీమిండియా మాజీ ప్లేయర్ గౌతమ్ గంభీర్ కి ఇండియన్ క్రికెట్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే భారత క్రికెట్లో అటు ధోని కెప్టెన్ గా  రెండు వరల్డ్ కప్ లు అందించాడు అన్న విషయం అందరికీ తెలుసు  కానీ ఈ వరల్డ్ కప్ టైటిల్స్ గెలవడంలో ఓపెనర్గా గౌతం గంభీర్ పాత్ర ఎంతో కీలకంగా ఉంది అన్నది కొంతమంది క్రికెట్ ప్రేక్షకులకు మాత్రమే తెలుసు అన్న విషయం తెలిసిందే. అయితే ఇట్లా వరల్డ్ కప్ గెలిచిన క్రెడిట్ మొత్తం ధోనికే వెళ్లడంతో గౌతమ్ గంభీర్ ఎన్నోసార్లు ధోనిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక మనసులో ఏది ఉన్న ముక్కుసూటిగా మాట్లాడే గంభీర్ ఎన్నో వివాదాలలో కూడా చిక్కుకుంటూ ఉంటారు.

 ఇకపోతే ఇటీవలే ఒక  ఇంటర్వ్యూలో పాల్గొన్న గౌతమ్ గంభీర్  2011 ప్రపంచ కప్ ఫైనల్  సమయంలో జరిగిన కొన్ని విషయాలను గుర్తు చేసుకున్నాడు. అప్పటికే ఆ మ్యాచ్లో 97 పరుగులతో రాణించిన తాను మ్యాచ్ ముగించే అవకాశాన్ని ధోనీకి వదిలేసా. ఇక ఇలా చేసినందుకు ఇప్పటికి పశ్చాత్తాప  పడుతూనే ఉంటా అంటూ గౌతమ్ గంభీర్  చెప్పుకొచ్చాడు. కాగా 2011 వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో 275 పరుగులతో బరిలోకి దిగిన టీమ్ ఇండియా ప్రారంభంలోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. దీంతో భారత బ్యాట్స్మెన్ లపై ఒత్తిడి పెరిగింది. అప్పుడు కుర్రోడు అయినా విరాట్ కోహ్లీ (35) తో కలిసి గంభీర్ ఇన్నింగ్స్ ని నిలబెట్టాడు.

 కోహ్లీతో  83 పరుగులు జోడించిన గంభీర్.. ధోనితో నాలుగో వికెట్ కి 109 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే సెంచరీకి మూడు పరుగుల వ్యవధిలో ఒత్తిడిని అధిగమించలేక క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మరోవైపు మహేంద్ర సింగ్ ధోని 91 నాట్ అవుట్ నిలిచి యువరాజ్ సింగ్ (21 )తో కలిసి తనదైన శైలిలో చర్యలు మ్యాచ్ ను ముగించాడు. ధోని ఫినిషింగ్ షాట్ గా కొట్టిన సిక్స్ ని ఇప్పటికీ ప్రేక్షకులు మర్చిపోలేరు. అయితే ఈ విన్నింగ్ షాట్ తో అప్పటి వరకు 97 పరుగులు చేసిన గంభీర్ కు రావాల్సిన గుర్తింపు రాలేదు. ఇటీవల ఇదే విషయంపై మరోసారి స్పందించాడు. 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో విజయ లాంచనాన్ని  పూర్తి చేయకపోవడమే నేను పశ్చాత్తాపడే విషయం అంటూ చెప్పుకొచ్చాడు. కాలాన్ని వెనక్కి తిప్పే అవకాశం లభిస్తే నేను మొదట చేసే పని అదే. మళ్ళీ ఆ మ్యాచ్ లోకి వెళ్లి విజయానికి కావాల్సిన ఆఖరి పరుగును నేనే చేస్తాను అంటూ గౌతమ్ గంభీర్ వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: