ఓటీటీ లో హల్ చల్ చేయనున్ననయా మూవీస్..!

murali krishna
నిన్న, ఈ రోజు అనగా జూన్ 27,28ఆ ప్రముఖ ఓటీటీల్లోకి రెండు తెలుగు సినిమాలు అడుగుపెట్టాయి.అందులో ఒకటి యాక్షన్ డ్రామాగా కాగా.. మరొకటి బోల్డ్ రొమాంటిక్ మూవీగా ఉంది. ఒక్క రోజు గ్యాప్‍తో ఈ చిత్రాలు స్ట్రీమింగ్‍కు రానున్నాయి.థియేటర్లలో రిలీజైన నెలలోగానే ఈ చిత్రాలు స్ట్రీమింగ్‍కు అడుగుపెడుతున్నాయి. నవదీప్ హీరోగా నటించిన ‘లవ్‍మౌళి’, కార్తికేయ హీరోగా చేసిన ‘భజే వాయువేగం’ ఈ వారమే ఓటీటీల్లోకి వచ్చేస్తున్నారు. స్ట్రీమింగ్ డేట్లు అధికారికంగా ఖరారయ్యాయి. లవ్‍ మౌళి, భజే వాయువేగం స్ట్రీమింగ్ వివరాలు ఇవే..లవ్ మౌళి సినిమా జూన్ 27 ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి వచ్చేసింది.బోల్డ్ రొమాంటిక్ లవ్ డ్రామాగా ఈ చిత్రం వచ్చింది. ట్రైలర్‌తో ఈ చిత్రం హైప్ తెచ్చుకుంది. జూన్ 7వ తేదీన ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే, లవ్ మౌళి చిత్రానికి హైప్‍కు తగ్గట్టు వసూళ్లు రాలేదు. మొదటి ఆట నుంచే తీవ్రంగా మిక్స్డ్ టాక్ రావటంతో ఆ తర్వాత కూడా పుంజుకోలేదు.లవ్ మౌళి చిత్రానికి అవనీంద్ర దర్శకత్వం వహించారు. బోల్డ్ కంటెంట్ పెట్టినా కథ, కథనం ఆకట్టుకోలేకపోవటంతో ఈ చిత్రం నిరాశపరిచింది. నవ్‍దీప్‍కు జోడీగా పంఖురి గిద్వానీ ఈ చిత్రంలో హీరోయిన్‍గా నటించారు. ఈ చిత్రాన్ని సీ స్పేస్, నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించగా.. గోవింద్ వసంత సంగీతం అందించారు. థియేటర్లలో పెద్దగా వసూళ్ల రాబట్టలేకపోయిన ఈ రొమాంటిక్ మూవీ ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.జూన్ 27నుంచే ఈ లవ్ మౌళి చిత్రాన్ని ఆహా ఓటీటీలో చూడొచ్చు.

కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన భజే వాయువేగం సినిమా మే 31వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ యాక్షన్ క్రైమ్ డ్రామా మూవీకి ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద మంచి పర్ఫార్మెన్స్ చేసింది. కలెక్షన్ల విషయంలో అంచనాలను అందుకుంది. నాలుగు వారాల్లోనే భజే వాయువేగం సినిమా ఓటీటీలోకి వస్తోంది. ఈ వారం జూన్ 28వ తేదీన ఈ చిత్రం 'నెట్‍ఫ్లిక్స్' ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది.భజే వాయువేగం సినిమా క్రికెట్ బెట్టింగ్‍, మాఫియా, ఛేజింగ్‍లు ఇలా సస్పెన్స్ అంశాలతో తెరకెక్కింది. దర్శకుడు ప్రశాంత్ రెడ్డి కథనం ప్రేక్షకులను మెప్పించింది. కార్తికేయ మరోసారి తన నటనతో ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్‍గా చేశారు. రాహుల్ టైసన్, తనికెళ్ల భరణి, రవిశంకర్, శరత్ లోహితస్వ, సుదర్శన్ కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీకి కపిల్ కుమార్, రదన్ సంగీతం దర్శకులుగా చేశారు.క్రికెట్ బెట్టింగ్‍లో గెలిచినా మాఫియా డబ్బు ఇవ్వకపోవడంతో వెంకట్ (కార్తికేయ) కారు ఎత్తుకెళ్లిపోవడం, ఆ తర్వాత ఎదురయ్యే పరిణామాల చుట్టూ భజే వాయువేగం స్టోరీ తిరుగుతుంది. ఆ కారులో భారీ డబ్బుతో పాటు శవం కూడా ఉంటుంది. ఆ మిస్టరీ ఏంటనేదే ఈ మూవీలో ప్రధాన అంశంగా ఉంటుంది. ఈ భజే వాయువేగం సినిమాను నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో జూన్ 28 నుంచి వీక్షించొచ్చు.సత్యం రాజేశ్ ప్రధాన పాత్ర పోషించిన టెనెంట్ సినిమా ఈవారంలో మరో ఓటీటీలోకి అడుగుపెడుతోంది. ఈ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, జూన్ 28వ తేదీన ఆహా ఓటీటీలో అందుబాటులోకి రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: