నాగీ సూపర్ ప్లాన్! కల్కి యూనివర్స్ లో మహేష్, తారక్ కూడా?

Purushottham Vinay
 ప్రభాస్ కల్కి 2898ఏడీ సినిమా గురువారం విడుదల అయ్యి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు నమోదు చేస్తూ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ మూవీ దేశావ్యాప్తంగా ఊహించని స్థాయిలో ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. రిలీజ్ అయిన మొదటి ఆట నుంచి మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది.విడుదలకి ముందు ఈ సినిమాకి చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రమోషన్స్ చేయకపోయిన ట్రైలర్ చూసాకా ఊహించని స్థాయిలో హైప్ అయితే క్రియేట్ అయ్యింది. అందువల్ల ఈ సినిమాకి భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. మొదటి మూడు రోజులకి చాలా చోట్ల థియేటర్స్ అన్ని కూడా హౌస్ ఫుల్ అయిపోయాయి. రెండు ట్రైలర్స్ తోనే ఈ సినిమా ఎంత అద్భుతంగా ఉండబోతుందనేది డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఆడియన్స్ కి చూపించాడు. దీంతో కల్కి సినిమా చూడాలనే ఇంటరెస్ట్ అందరిలో పెరిగింది.. మొత్తానికి బ్లాక్ బస్టర్ టాక్ తో ఫస్ట్ రోజు 191.5 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది ఈ సినిమా. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని సీనియర్ నిర్మాత అశ్వినిదత్ ఏకంగా 600 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పడుకొనే, దిశా పటాని, మృనాల్ టాకూర్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. అశ్వత్థామ, అర్జునుడు, కర్ణుడు, శ్రీకృష్ణుడు వంటి వివిధ పాత్రలు ఈ చిత్రంలో భాగం అయినందున ఆడియన్స్ బాగా థ్రిల్ అయ్యారు.


 అయితే ఇతర పాత్రలను సినిమాలో స్పష్టంగా చూపించినప్పటికీ, శ్రీకృష్ణుడి పాత్ర మాత్రం  బ్యాక్ సైడ్ నుంచి మాత్రమే నాగ్ అశ్విన్ ఎంతో అద్భుతంగా చూపించాడు. ఆకాశమే నీ హద్దురా చిత్రంలో నటించిన నటుడు కృష్ణ కుమార్ ఈ పాత్రను పోషించాడు. అయితే ఎక్కడా కూడా అతని ముఖం కనిపించనివ్వ లేదు. కేవలం అతని శరీరం మాత్రమే కనిపిస్తుంది. కృష్ణ కుమార్ కూడా ఈ పాత్రకు ఎన్నో ప్రశంసలు అందుకున్నాడు. తెలుగు సినిమాలో ఇంత ముఖ్యమైన పాత్ర పోషించినందుకు అతను కూడా సంతోషంగా ఉన్నాడు. అయితే శ్రీకృష్ణుడి పాత్ర మామూలు పాత్ర కాదు కాబట్టి ఖచ్చితంగా ఆ పాత్రకి టాప్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయించాలనే డిమాండ్ నెటిజన్స్ నుంచి మొదలైంది. ఇది సినిమా ప్రేమికులందరి చిరకాల ఆశ. మహేష్ బాబును శ్రీకృష్ణుడిగా చూపించాలని కేవలం మహేష్ బాబు అభిమానులే కాకుండా టాలీవుడ్ సినిమా లవర్స్ కూడా ఎంతో ఆశపడుతున్నారు. ఈ పాత్రను పోషించడానికి మహేష్ బాబు సరైన ఎంపిక అని కామెంట్స్ చేస్తూ ఆ పాత్రకి కల్కి పార్ట్ 2 లో మహేష్ బాబుని సెట్ చెయ్యండి అంటూ నెటిజన్స్ నాగీ పై ఒత్తిడి తెస్తున్నారు. మరి అది నిజమైతే టాప్ లేచిపోవడం పక్కా.. ఫ్యాన్స్ థియేటర్లలో బట్టలు చించుకోవడం పక్కా.. 


ఇంకా అంతే కాదండోయ్ పరశురామ్ గా చిరంజీవి చేయనున్నారని వార్తలు వస్తుండగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని కూడా చూపించమని టాలీవుడ్ ఫ్యాన్స్ ఆశపడుతున్నారు.. ఎన్టీఆర్ ని దుర్యోధనుడిగా లేక అభిమన్యుడిగా చూపించమని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. నాగీ కూడా మహేష్ ని, ఎన్టీఆర్ ని సెట్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నాడు. మహేష్ కి ఎన్టీఆర్ కి అశ్వినిదత్ తో మంచి అనుబంధం ఉంది.. పైగా కల్కి సినిమా యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకుంది కాబట్టి వాళ్ళు కూడా ఒప్పుకునే ఛాన్స్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: