మెగా హీరో కోసం అలాంటి పని చేసిన "మట్కా" మూవీ మేకర్స్..?

murali krishna
మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.వరుణ్ తేజ్ గత ఏడాది గాంధీవధారి అర్జున్ సినిమాతో ప్రేక్షకులను పలకరించగా ఆ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.అలాగే ఈ ఏడాది ఆపరేషన్ వాలంటైన్ సినిమాతో ప్రేక్షకులను మెప్పించాడు.ఈ సినిమా కూడా ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు.దీనితో వరుణ్ తేజ్ ప్రస్తుతం చాలా జాగ్రత్తగా సినిమాలను ఎంపిక చేసుకుంటున్నాడు.వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “మట్కా”.. ఈసినిమా ను “పలాస 1978 ” మూవీ ఫేమ్ కరుణ కుమార్ తెరకెక్కిస్తున్నారు.'మట్కా' ప్రస్తుతం మూడో షెడ్యూల్ జరుపుకుంటోంది. ఇది 35 రోజుల లాంగ్ షూటింగ్ షెడ్యూల్. దీనిలో భాగంగా వైజాగ్ సెట్‌ను క్రియేట్ చేయనున్నారు మూవీ టీమ్. ప్రొడక్షన్ టీం వింటేజ్ వైజాగ్ లోకేషన్స్‌ని రామోజీ ఫిల్మ్ సిటీ లో మ్యాసీవ్ సెట్‌లలో రిక్రియేట్ చేస్తోంది.ప్రేక్షకులకు అథెంటిసిటీ, గ్రాండియర్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందించే లక్ష్యంతోనే ఈ సెట్ వేయనుందని సమాచారం. అందుకోసం టీమ్ చాలా వర్క్ చేస్తోంది. అయితే, ఈ వైజాగ్ సెట్ కోసం రూ. 15 కోట్లు ఖర్చు కానుందట. ఈ ఒక్క ఫేజ్‌కే 15 కోట్ల మ్యాసీవ్ బడ్జెట్‌ను కేటాయించారు నిర్మాతలు.ఇదిలా ఉంటే, 'మట్కా' హై బడ్జెట్‌ పాన్-ఇండియా చిత్రంగా రూపొందుతోంది. వింటేజ్ సెట్లలో ఇన్వెస్ట్మెంట్ విజువల్ వండర్‌ని అందిస్తోంది. వైజాగ్‌లోని ఎసెన్స్‌ని ప్రతిబింబించేలా రూపొందించిన ఈ సెట్‌లు సినిమా హైలైట్‌లలో ఒకటిగా నిలుస్తాయని మేకర్స్ చెబుతున్నారు. ఇటీవల రిలీజ్ అయిన మేకింగ్ వీడియో ఇంటెన్సీవ్ ప్రీ-ప్రొడక్షన్, గ్రాండ్-స్కేల్ మేకింగ్‌ను ప్రజెంట్ చేసింది. ఇందులో వరుణ్ తేజ్ గ్లింప్స్ కూడా చూపించారు.
వెర్సటైల్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకునే వరుణ్ తేజ్ 'మట్కా'లో మరో మరపురాని పాత్రకు జీవం పోయనున్నారు. ఈ చిత్రంలో అతని పాత్ర దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించనుందని మేకర్స్ గట్టిగా నమ్ముతున్నారు. దేశాన్ని కదిలించిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కతోందని సమాచారం.ఈ మట్కా సినిమాకు కరుణ కుమార్ దర్శకత్వం వహించారు. మ్యాసీవ్ స్క్రిప్ట్‌తో డైరెక్టర్ కరుణ కుమార్ పని చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా బ్యూటిఫుల్ మీనాక్షి చౌదరి నటిస్తుండగా, బాలీవుడ్ హాట్ బ్యూటి నోరా ఫతేహి కీలక పాత్రలో కనిపించనుంది. హ్యుజ్ బడ్జెట్‌తో నిర్మించిన సెట్స్‌తో పాటు యూనిక్ కాన్సెప్ట్‌తో కూడిన ఈ చిత్రం ప్రేక్షకులను అద్భుతంగా అలరిస్తుందని 'మట్కా' మేకర్స్ నమ్మకంగా ఉన్నారు.అయితే, మట్కా నిర్మాతల లక్ష్యం కేవలం ఎంటర్‌టైన్మెంట్ మాత్రమే కాదు, ఇండియన్ సినిమా చరిత్రలో నిలిచిపోయే సినిమాటిక్ అనుభూతిని క్రియేట్ చేయడం అని తెలుస్తోంది. టాప్ క్లాస్ నిర్మాణ విలువలు, వింటేజ్ వైజాగ్ రిక్రియేషన్ హైలైట్‌లుగా ఉంటూ వరుణ్ తేజ్ కెరీర్‌లో 'మట్కా' ఒక మైల్ స్టోన్ మూవీ కావాలని ఆకాంక్షిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: