క‌ల్కి 2898 AD: హాలీవుడ్ లో జెండా పాతిన మొట్టమొదటి ఇండియన్ సినిమా..!

FARMANULLA SHAIK
క‌ల్కి మేనియాతో తెలుగు రాష్ట్రాల్లో థియేట‌ర్లు మోత‌మోగిపోతున్నాయి. క‌ల్కి థియేట‌ర్ల‌లో నిన్న నుంచి ప్ర‌భాస్ ఫ్యాన్స్ సంబ‌రాలు అంబ‌రాన్నంటాయి. సింగిల్ స్క్రీన్స్, మ‌ల్టీప్లెక్స్ అనే తేడా లేకుండా థియేట‌ర్లు మొత్తం హౌజ్‌ఫుల్స్‌తో క‌ళ‌క‌ళ‌లాడుతోన్నాయి.మార్నింగ్ ఆట నుంచి క‌ల్కికి పాజిటివ్ టాక్ ల‌భిస్తోంది. ప్ర‌భాస్ రోల్‌, యాక్టింగ్‌తో పాటు అత‌డి కామెడీ టైమింగ్ అదుర్స్ అంటూ ఫ్యాన్స్ ప్ర‌శంజ‌లు కురిపిస్తోన్నారు. అమితాబ్‌బ‌చ్చ‌న్‌, దీపికా ప‌దుకోణ్ రోల్‌, విజువ‌ల్స్ అద్భుత‌మంటూ చెబుతోన్నారు. కల్కి మూవీతో హాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం షేక్ అవుతుంద‌ని ఫ్యాన్స్ అంటున్నారు. హాలీవుడ్ గ‌డ్డ‌పై జ‌య‌కేత‌నం ఎగుర‌వేసిన ఫ‌స్ట్ ఇండియ‌న్ మూవీగా నిల‌వ‌డం అంటున్నారు. హాలీవుడ్‌లో క‌ల్కి జెండా పాతింద‌ని అంటున్నారు.
ప్ర‌భాస్‌, క‌మ‌ల్‌హాస‌న్‌, అమితాబ్‌బ‌చ్చ‌న్‌తో పాటు అంద‌రికి స‌మ ప్రాధాన్య‌త‌నిస్తూ నాగ్ అశ్విన్ ఈ సినిమాను తెర‌కెక్కించాడ‌ని అంటున్నారు. ప్ర‌తి సీన్ క్లైమాక్స్‌లా ఉంటుంద‌ని, ఈ మూవీతో హాలీవుడ్ రికార్డులు బ్రేక్ కావ‌డం ఖాయ‌మ‌ని చెబుతోన్నారు.తెలుగు ఇండ‌స్ట్రీలో క‌ల్కి లాంటి సినిమాలు చాలా త‌క్కువ‌గా వ‌స్తాయ‌ని, నంబ‌ర్ వ‌న్ ఫిల్మ‌స్ ఇద‌ని కామెంట్స్ చేస్తున్నారు. ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్‌, బీజీఎమ్, టెక్నిక‌ల్‌గా హాలీవుడ్ సినిమాల‌కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా నాగ్ అశ్విన్ ఈ సినిమా చేశాడ‌ని అంటున్నారు. ప‌క్కా వెయ్యి కోట్ల మూవీ ఇద‌ని అంటున్నారు.రాజ‌మౌళి త‌ర్వాత ప్ర‌భాస్‌లోని హీరోయిజాన్ని బాగా ఎలివేట్ చేసిన డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ అని, భైరవ పాత్ర‌లో ప్ర‌భాస్ దుమ్మురేపాడ‌ని చెబుతోన్నారు. ప్ర‌భాస్ కెరీర్‌లో వ‌న్ అఫ్ ఇది బెస్ట్ మూవీగా క‌ల్కి మూవీ నిలుస్తుంద‌ని ఫ్యాన్స్ చెబుతోన్నారు. స‌లార్‌కు మించి ఈ సినిమా ఉంద‌ని అంటున్నారు. క్లైమాక్స్‌లో ప్ర‌భాస్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ క‌నిపించే సీన్స్ థియేట‌ర్ల‌లో ర‌చ్చ చేశాయ‌ని పేర్కొంటున్నారు.మాస్ ఆడియెన్స్‌కు ఈ సినిమా అంత ఈజీగా అర్థం కాద‌ని మ‌రికొంద‌రు నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు. కాంప్లెక్స్, శంబాల‌తో పాటు ఇందులోని విజువ‌ల్స్‌, స్క్రీన్‌ప్లే అంత ఈజీగా అర్థం కాద‌ని చెబుతోన్నారు.క‌ల్కి 2898 ఏడీ మూవీకి నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ప్ర‌భాస్‌తో పాటు అమితాబ్‌బ‌చ్చ‌న్‌, క‌మ‌ల్‌హాస‌న్, దీపికా ప‌దుకోణ్ న‌టించాడు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, దుల్క‌ర్ స‌ల్మాన్‌, మృణాల్ ఠాకూర్‌తో పాటు రాజ‌మౌళి, ఆర్‌జీవీ గెస్ట్ రోల్స్‌లో క‌నిపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: