నాకు బ్రెస్ట్ క్యాన్సర్.. షాకింగ్ విషయం చెప్పిన బిగ్ బాస్ బ్యూటీ?

praveen
సినీ సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే హీరో హీరోయిన్లకు సంబంధించి ఏ విషయం తెరమీదకి వచ్చినా కూడా అది  హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా కారణంగా ఇక సినీ సెలెబ్రిటీలకు సంబంధించిన అన్ని విషయాలను కూడా ఎంతో సులభంగా తెలుసుకోగలుగుతున్నారు నేటిజన్స్. అంతేకాదు సెలబ్రిటీలే తమ పర్సనల్ విషయాలను కూడా అభిమానులతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నారు.

 అయితే ఒకప్పుడు ఎన్ని విషయాలు బయటకు చెప్పినా తమ ఆరోగ్య సమస్యల గురించి హీరో హీరోయిన్లు బయటికి చెప్పేవారు కాదు.. ఎందుకంటే ఇక ఎప్పుడు తమ వీక్నెస్ ల గురించి ఆరోగ్య సమస్యల గురించి బయటకు చెప్పిన ఇక సినిమాల్లో తమను చూసిన ప్రేక్షకులు ముందుగా అవే గమనిస్తూ ఉంటారని.. తమ నటనను పెద్దగా గమనించరు అని భయపడేవారు. కానీ ఈ మధ్యకాలంలో మాత్రం సినీ సెలెబ్రిటీలు ఆరోగ్య సమస్యల గురించి కూడా అభిమానులతో పంచుకోవడం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలోనే కొంతమంది హీరోయిన్లు చెప్పేవి షాకింగ్ విషయాలు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి.

 కాగా ఇటీవలే మరో నటి కూడా తన సమస్య గురించి చెప్పుకొచ్చింది. నటి హీనా ఖాన్ బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె ఇంస్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు. అయితే క్యాన్సర్ తో చేసే పోరాటంలో అండగా ఉండాలని తనకోసం ప్రార్థించాలని అభిమానులను కోరారు ఆమె. అందరి సపోర్టుతో ఈ వ్యాధిని జయిస్తాను అంటూ ఆమె ధీమా వ్యక్తం చేశారు. కాగా ప్రస్తుతం ఆమె మూడవ స్టేట్స్ బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈమె పలు సీరియల్స్ తో పాటు బిగ్ బాస్ లోకి వెళ్లడం ద్వారా పాపులారిటీ సంపాదించారు. కాగా ఈమెకు ఇంస్టాగ్రామ్ లో 19 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: