"దిఫేస్ "మ్యాగజైన్ పై మెరుస్తున్న సీతా మహాలక్ష్మి..!

murali krishna
మృణాల్ ఠాకూర్ ప్రతిభావంతులైన న‌టి. ప్రధానంగా హిందీ-తెలుగు- మరాఠీ చిత్రాలలో అలాగే టెలివిజన్ సీరియల్స్‌లో న‌టించింది. ప్రముఖ టెలివిజన్ ధారావాహిక కుంకుమ్ భాగ్య`లో బుల్బుల్ పాత్రతో మంచి గుర్తింపు పొందింది. మృణాల్ 2018లో `లవ్ సోనియా చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ చిత్రంలో నామమాత్రపు పాత్రను పోషించింది. ఆ త‌ర్వాత సూపర్ 30, బాట్లా హౌస్ వంటి చిత్రాలలో ముఖ్యమైన పాత్రలలో కనిపించింది. సీతారామం, హాయ్ నాన్న చిత్రాల‌తో గొప్ప విజ‌యాల‌ను అందుకుని న‌టిగా స‌త్తా చాటింది. ఇప్పుడు భార‌త‌దేశంలోని అగ్ర న‌టీమ‌ణుల్లో ఒక‌రిగా కొన‌సాగుతోంది.త‌న‌దైన అందం న‌ట‌ప్ర‌తిభ‌తో ప్ర‌తిసారీ ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది మృణాల్ ఠాకూర్. దుల్కార్ స‌ర‌స‌న సీతారామం లాంటి బ్లాక్‌బ‌స్టర్ చిత్రంలో న‌టించిన మృణాల్ ఆ త‌ర్వాత నాని స‌ర‌స‌న హాయ్ నాన్న చిత్రంలో న‌టించింది. ఇది కూడా మృణాల్ కెరీర్ లో బెస్ట్ హిట్ చిత్రాల్లో ఒక‌టిగా నిలిచింది. ఇప్పుడు పాన్ ఇండియ‌న్ సంచ‌ల‌నం క‌ల్కిలోను మృణాల్ అవ‌కాశం ద‌క్కించుకోవ‌డం యాధృచ్చికం. కానీ ఈ సినిమాలో అతిథి పాత్ర‌లో మృణాల్ త‌ళుక్కుమ‌న్న తీరు అంద‌రినీ ఆక‌ట్టుకుంది. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, ప్రభాస్, కమల్ హాసన్ లాంటి దిగ్గ‌జాలు న‌టించిన చిత్రంలో మృణాల్ కి ఒక పాత్ర‌లో అవ‌కాశం ద‌క్కింది.క‌ల్కి విజ‌యాన్ని నాగి బృందంతో క‌లిసి సెల‌బ్రేట్ చేసుకుంటున్న ఈ భామ‌.. సోష‌ల్ మీడియాల్లో ఆ ఆనందాన్ని దాచుకోవ‌డం లేదు.

తాజాగా ది ఫేస్ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీ ముఖ‌చిత్రంగా క‌నిపించింది. ఈ ఫోటోగ్రాఫ్ లో మృణాల్ ఎంతో బ్యూటిఫుల్ గా డ్యాషింగ్ గా క‌నిపిస్తోంది. మృణాల్ ట్రెడిష‌న‌ల్ డిజైన‌ర్ డీప్ పింక్ ఫ్రాక్ ధ‌రించి ఎంతో అందంగా క‌నిపించింది. ఈ పింక్ ఫ్రాక్ కి కాంబినేష‌న్ గా మెడ‌లో ఆభ‌ర‌ణాలు ఆక‌ట్టుకున్నాయి. ప్ర‌స్తుతం ఈ అంద‌మైన ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.తాజా ఇంట‌ర్వ్యూలో క‌ల్కి ఆఫ‌ర్ గురించి మృణాల్ ముచ్చ‌టించింది. కల్కి కోసం నన్ను సంప్రదించినప్పుడు ఎస్ అని చెప్పడానికి ఒక్క క్షణం కూడా పట్టలేదు. నిర్మాతలు అశ్వనీదత్, స్వప్నా దత్, ప్రియాంకలపై నాకు అపారమైన నమ్మకం ఉంది. సీతా రామం కోసం క‌లిసి ప‌ని చేసాక ఈ నిర్ణయం తీసుకోవ‌డానికి క్ష‌ణం కూడా ప‌ట్ట‌లేదు. ఇలాంటి ఒక గొప్ప చిత్రంలో భాగం కావడం.. ఈ సంపూర్ణ దార్శనిక చిత్ర నిర్మాణంలో భాగం కావ‌డం ఎంతో ఆనందాన్నిస్తోంది`` అని మృణాల్ తెలిపింది. క‌ల్కి తారాగ‌ణంలో చేరినందుకు చాలా థ్రిల్లింగ్ గా ఉన్నాన‌ని కూడా మృణాల్ పేర్కొంది. ఈ చిత్రంలో త‌న పాత్ర కూడా ఒక స‌ర్ ప్రైజ్ ట్రీట్ అని చెప్పాలి. ఇది అభిమానులలో ఉత్సాహం నిరీక్షణను పెంచింది. క‌ల్కి విడుద‌ల రోజే బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ తెచ్చుకుంది. మొద‌టి రోజు సుమారు 200 కోట్లు వ‌సూలు చేసింద‌ని ట్రేడ్ చెబుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: