మిల్క్ బ్యూటీ బయోగ్రఫీ వద్దంటూ షాక్ ఇచ్చిన పేరెంట్స్..!

murali krishna
హ్యాపీడేస్ సినిమాతో తెలుగు యువతలో చిరస్థాయిగా క్రష్ ముద్ర వేసుకుంది బ్యూటిఫుల్ తమన్నా . మంచు మనోజ్ శ్రీ సినిమాతో తెలుగులోకి పరిచయమైనప్పటికీ హ్యాపీ డేస్ తీసుకొచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. అందులో మధుగా యూత్ గుండెల్లో గూడు కట్టుకుంది. అనంతరం తెలుగు, తమిళం వంటి సౌత్ సినిమాలతోనే కాకుండా హిందీలోను తన సత్తా చాటుతూ హీరోయిన్‌గా దూసుకుపోయింది తమన్నా. తెలుగులో దాదాపు అగ్ర హీరోలందరి కలిసి నటించి స్టార్ హీరోయిన్ రేంజ్‍ సంపాదించుకుంది.అయితే తాజాగా తమన్నా పై వచ్చిన ఒక న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.అదేంటంటే బెంగ‌ళూరులోని హెబ్బ‌ళ సింధీ పాఠ‌శాల‌లో ఏడో త‌ర‌గ‌తి బుక్స్‌లో హీరోయిన్‌ త‌మ‌న్నా జీవిత చ‌రిత్ర‌ను ఓ పాఠ్యాంశంగా చేర్చ‌డంపై విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతోన్నాయి. త‌మ‌న్నా జీవిత చ‌రిత్ర‌ను స్కూల్ బుక్స్ నుంచి తొల‌గించాల‌ని పేరెంట్స్ డిమాండ్ చేస్తోన్నారు.ఏడో త‌ర‌గ‌తి బుక్స్‌లో త‌మ‌న్నాతో పాటు బాలీవుడ్ హీరో ర‌ణ్‌వీర్‌సింగ్ జీవిత చ‌రిత్ర‌ను ఓ పాఠ్యాంశంగా చేర్చారు. సింధీ వ‌ర్గం నుంచి సినిమా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టి పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో పేరుప్ర‌ఖ్యాతులు సంపాదించుకున్న ర‌ణ్‌వీర్‌సింగ్‌, త‌మ‌న్నా జీవితం విద్యార్థుల‌కు స్ఫూర్తిదాయ‌కంగా ఉంటుంద‌ని స్కూల్ మేనేజ్‌మెంట్ భావించింది. ఈ ఏడాది కొత్త పాఠ్య‌పుస్త‌కాల్లో త‌మ‌న్నాతో పాటు ర‌ణ్‌వీర్‌సింగ్ సినీ ప్ర‌యాణాన్ని, సాధించిన విజ‌యాలు, అవార్డుల‌ను ఆవిష్క‌రిస్తూ పాఠ్యాంశాల‌ను చేర్చారు.త‌మ‌న్నా జీవితాన్ని పాఠ్యాంశంగా స్కూల్ బుక్స్‌లో పెట్ట‌డంపై పేరెంట్స్‌తో పాటు విద్యా సంఘాలు వ్య‌తిరేకెత్తిస్తోన్నాయి. త‌మ‌న్నా జీవితం చ‌రిత్ర‌ను స్కూల్ బుక్స్ నుంచి తొల‌గించాల‌ని డిమాండ్ చేస్తోన్నారు. ఈ వివాదంపై చిల్డ్ర‌న్ రైట్స్ క‌మీష‌న్‌తో పాటు క‌ర్ణాట‌క‌ ప్రైమ‌రీ అండ్ సెకండ‌రీ స్కూల్స్ బోర్డ్‌కు విద్యార్థుల త‌ల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

సింధీ వ‌ర్గం నుంచి ఫేమ‌స్ అయిన క‌ళాకారుల జీవితాల‌ను పాఠ్య‌పుస్త‌కాల్లో చేర్చ‌డంపై త‌మ‌కు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని , త‌మ‌న్నా గురించి కాకుండా ఎవ‌రైనా వెట‌ర‌న్ యాక్ట‌ర్స్ లైఫ్‌ను సిల‌బ‌స్‌లో చేర్చితే బాగుండేద‌ని అంటున్నారు. త‌మ‌న్నా గురించి పుస్త‌కాల్లో ఒక‌టి ఉంటే ఇంట‌ర్‌నెట్‌లో మాత్రం ఫొటోలు, కంటెంట్ మ‌రోలా ఉండ‌టంతో విద్యార్థులు క‌న్ఫ్యూజ్ అయ్యే అవ‌కాశం ఉంద‌ని ఓ విద్యార్థి తండ్రి ఈ కంప్లైంట్‌లో పేర్కొన్నాడు.త‌మ‌న్నా జీవితం నుంచి ఏడో త‌ర‌గ‌తి విద్యార్థులు ఏ విధంగానూ స్ఫూర్తి పొంద‌లేర‌ని, వారికి ఆమె పాఠం సూట‌బుల్ కాదంటూ మ‌రో పేరెంట్ త‌న కంప్లైంట్‌లో తెలిపాడు. బోల్డ్‌, సెమీ న్యూడ్ రోల్స్ చేసే వారి జీవితాల‌ను పాఠాలుగా స్కూల్ బుక్స్‌లో స‌మంజ‌సం కాద‌ని స్కూల్ యాజ‌మాన్యంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.త‌మ‌న్నాజీవితాన్ని పాఠంగా పెట్ట‌డంపై క‌ర్ణాట‌క ప్రైమ‌రీ సెకండ‌రీ స్కూల్ బోర్డ్ సీరియ‌స్ అయిన‌ట్లు తె లిసింది. బోర్డ్ అనుమ‌తి లేకుండా స్కూల్ సిల‌బ‌స్‌లో జోడించిన త‌మ‌న్నా జీవిత చ‌రిత్ర‌ను సిల‌బ‌స్ నుంచి తొల‌గించాల‌ని స్కూల్ వ‌ర్గాల‌కు సూచించిన‌ట్లు స‌మాచారం. ర‌ణ్‌వీర్‌సింగ్ జీవిత చ‌రిత్ర‌పై పేరెంట్స్ ఎలాంటి అభ్యంత‌రాలు వ్య‌క్తం చేయ‌లేద‌ని స‌మాచారం. కేవ‌లం త‌మ‌న్నా పాఠాన్ని మాత్ర‌మే తొల‌గించాల‌ని డిమాండ్ చేసిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.ప్ర‌స్తుతం త‌మ‌న్నా తెలుగులో ఓదెల 2 మూవీ చేస్తోంది. డైరెక్ట‌ర్ సంప‌త్ నంది క్రియేట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న ఈ మూవీకి అశోక్ తేజ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నారు. ఇందులో శివ‌శ‌క్తి అనేపాత్ర‌లో త‌మ‌న్నా క‌నిపించ‌బోతున్న‌ది. హెబ్బా ప‌టేల్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: