మా టీమ్ లేకపోతే.. నా మద్దతు టీమిండియాకే : మాజీ ప్లేయర్

praveen
ప్రస్తుతం వెస్టిండీస్, యూఎస్ వేదికగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా భారత జట్టు ఎంత అద్భుతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారీ అంచనాల మధ్య టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన టీమిండియా అందరి అంచనాలను అందుకోవడమే కాదు అంచనాలకు మించి రాణిస్తుంది. ఒక మ్యాచ్ లో కూడా ఇప్పుడు వరకు ఓడిపోకుండా.. ఏకంగా సెమి ఫైనల్లో అడుగు పెట్టేందుకు సిద్ధమవుతుంది. లీగ్ దశలో జరిగిన నాలుగు మ్యాచ్లలో కూడా వరుసగా విజయాలు సాధించిన టీమిండియా.. సూపర్ 8 లో ఎంతో అలవోకగా ఛాన్స్ దక్కించుకుంది.

 అయితే ఎట్టి పరిస్థితుల్లో ఈసారి టైటిల్ విజేతగా నిలిచి విశ్వ విజేత అనిపించుకోవాలని చూస్తున్న టీమిండియా.. సూపర్ 8 లాంటి కీలక దశలో కూడా అదరగొడుతుంది. ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ లాంటి జట్లతో జరిగిన మ్యాచ్లలో వరసగా విజయాలు సాధించింది అని చెప్పాలి. ఇక నేడు ఆస్ట్రేలియా తో తలబడబోతుంది. ఈ క్రమంలోనే టీమ్ ఇండియా ఇలా అన్ని విభాగాల్లో రాణిస్తున్న తీరు చూసి మాజీ ఆటగాళ్లు అందరూ కూడా టీం ఇండియా పై ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు అని చెప్పాలి. కాగా వరల్డ్ కప్ లో టీమిండియా ప్రదర్శన పై స్పందించిన  వివ్ రిచర్డ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

 టి20 వరల్డ్ కప్ టోర్నిలో వెస్టిండీస్  లేకపోయి ఉంటే తాను టీమిండియాకే మద్దతును ఇస్తాను అంటూ మాజీ క్రికెటర్ వివ్ రిచర్డ్స్ అభిప్రాయపడ్డాడు. బంగ్లాదేశ్ పై విజయం అనంతరం బెస్ట్ ఫీల్డర్ మెడల్ ఇచ్చేందుకు ఈ మాజీ ప్లేయర్ భారత డ్రస్సింగ్ రూమ్ కి వచ్చారు. మీ జట్టు చాలా బలంగా ఉంది. అన్ని విభాగాల్లోనూ బాగా ఆడుతుంది. గడ్డు పరిస్థితిని దాటి వచ్చిన పంతును చూస్తే చాలా ఆనందంగా ఉంది. అతను మున్ముందు మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటాడు అంటూ వివ్ రిచర్డ్స్ ప్రశంసలు కురిపించాడు. ఈ క్రమంలోనే బెస్ట్ ఫీడర్ మెడల్ అందించిన తర్వాత రిషబ్ పంత్ ని ఆలింగనం చేసుకున్నాడు వివ్ రిచర్డ్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: