గంభీర్ గొప్ప ఫైటర్.. అశ్విన్ కామెంట్స్ వైరల్?

praveen
టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ గురించి భారత క్రికెట్ ప్రేక్షకులకు  కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీ లో టీమిండియా రెండు వరల్డ్ కప్ లు గెలిచింది అన్న విషయం అందరికీ తెలుసు. కానీ ఈ రెండు వరల్డ్ కప్ లు గెలవడంలో కీ రోల్ పోషించింది గౌతమ్ గంభీర్ అన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఎందుకంటే ఈ రెండు వరల్డ్ కప్ లో ఓపెనర్ గా టీమిండియా తరఫున బరులోకి దిగిన గౌతం గంభీర్  ఎన్నో వీరుచితమైన ఇన్నింగ్స్ లు ఆడి భారత జట్టును క్లిష్ట పరిస్థితుల్లో ఎన్నోసార్లు విజయతీరాలకు నడిపించాడు.

 అయితే గౌతమ్ గంభీర్  తన ఆటతీరుతో ఎంతలా పాపులారిటీ సంపాదించుకున్నాడో.. ఇక వివాదాలతో కూడా అంతే ఫేమస్ అయ్యాడు. ఎప్పుడు ముక్కుసూటిగా మాట్లాడుతూ ఉంటాడు గంభీర్. అంతేకాదు ఇక ప్రత్యర్ధులతో ఎప్పుడు గొడవ పెట్టుకుంటూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే  ఇలాంటి గొడవలతో కూడా ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. అయితే అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా గౌతమ్ గంభీర్ ఇలాగే ఎంతో దూకుడుగా ఉన్నాడు. ఏకంగా తాను క్రికెటర్ గా ఉన్న సమయంలో ఎవరైనా చేదు అనుభవాల గురించి ఎన్నోసార్లు సోషల్ మీడియా వేదికగా షాకింగ్ విషయాలను చెప్పాడు.

కాగా ఇక ఇప్పుడు గౌతమ్ గంభీర్ ఏకంగా టీమ్ ఇండియాకు హెడ్ కోచ్గా పదవి బాధ్యతలు చేపట్టబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో గౌతమ్ గంభీర్ గురించి భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కెరియర్ ఆరంభంలో తనలో ఆత్మవిశ్వాసం పెంచడంలో గంభీర్ కీలక పాత్ర పోషించారు అంటూ అశ్విన్ చెప్పుకొచ్చాడు. ఆటపై అతనికి ఉన్న అవగాహన ఎంతో అత్యుత్తమమైనది అంటూ కొనియాడాడు. అయితే గౌతమ్ గంభీర్ గొప్ప ఫైటర్. జట్టు విజయం కోసం ఎల్లప్పుడూ కష్టపడే వ్యక్తి. కానీ అతని ప్రవర్తనను చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నారు. నాకు అతనిపై అపారమైన గౌరవం ఉంది అంటూ అశ్విన్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: