సానియా మీర్జా - షమీ పెళ్లిఫై.. స్పందించిన సానియా తండ్రి?

praveen
టీమిండియా స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా గత కొన్ని రోజుల నుంచి ఎంతలా వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోతుందో ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు. దీనికి కారణం ఏకంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త పాకిస్తాన్ మాజీ ప్లేయర్ షోయబ్ మాలిక్ తో సానియా మీర్జా విడాకులు తీసుకోవడం సంచలనం గా మారి పోయింది. ఒకప్పుడు ప్రేమ కోసం ఎన్ని విమర్శలు వచ్చినా దేశాన్ని మొత్తం ఎదిరించి పాకిస్తాన్ క్రికెటర్ ను పెళ్లి చేసుకుంది సానియా మీర్జా.

 ఇలా తన కోసం ఎంతో త్యాగం చేసిన సానియా మీర్జాను.. అటు షోయబ్ మాలిక్ మాత్రం వదిలేశాడు. ఏకంగా విడాకులు తీసుకునేందుకు రెడీ అయ్యాడు  అయితే విడాకుల ప్రకటన రాకముందే షోయబ్ మాలిక్ పాకిస్తాన్ నటి తో మూడో వివాహం చేసుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇది కాస్త సంచలనం గా మారిపోయింది. అయితే ఇలా తన భర్త షోయబ్ మాలిక్ చేసిన పనిపై అటు సానియా మీర్జా కూడా విమర్శలు చేసింది.  ఇక సానియా మీర్జా విడాకులు తీసుకుందో లేదో ఆమె రెండో పెళ్లి గురించి వార్తలు మొదలయ్యాయి.

 టీమిండియా స్టార్ ప్లేయర్ అయిన మహమ్మద్ షమిని సానియా మీర్జా రెండో వివాహం చేసుకోబోతుంది అంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే ఈ ప్రచారంపై ఇటీవలే సానియా మీర్జా తండ్రి ఇమ్రాన్ మీర్జా స్పందించారు. అదంతా చెత్త ప్రచారం. అసలు ఇప్పటివరకు మహమ్మద్ షమీని సానియా మీర్జా కలవనే లేదు అంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు. అయితే సానియా మీర్జా అటు భర్త షోయబ్ మాలిక్ తో విడాకులు తీసుకోగా.. టీమిండియా స్టార్ క్రికెటర్ మహమ్మద్ షమీ తన భార్య హసన్ జోహన్ తో విడాకులు తీసుకొని ఒంటరిగానే ఉంటున్నాడు. దీంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు పుట్టుకొచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: